Begin typing your search above and press return to search.
టిల్లు నుంచి హీరోయిన్స్ అందుకే పారిపోతున్నారా?
By: Tupaki Desk | 14 Dec 2022 10:30 AM GMT'టిల్లు 2'.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో అత్యంత హాట్ టాపిక్ గా మారుతున్న సినిమా ఇది. యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించి, రచయితగానూ వర్క్ చేసిన మూవీ 'డీజే టిల్లు'. విమల్‌కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. కేవలం రూ. 4 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు భారీ వసూళ్లని రాబట్టి చిన్న సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
క్లైమాక్స్ లోనే సీక్వెల్ కి హింట్ ఇచ్చిన టీమ్ అన్నట్టుగానే 'టిల్లు 2' పేరుతో సీక్వెల్ ని మొదలు పెట్టింది. డైరెక్టర్ మారిపోయాడు.. విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్ వచ్చి చేరాడు..సీక్వెల్ లో వుండాల్సిన హీరోయిన్ నేహాశెట్టి కూడా మారిపోయింది.
తన స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది. షూటింగ్ మొదలైంది. అక్కడ నుంచి 'టిల్లు 2' తిప్పలు షురూ.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తప్పుకుంది. ఆ స్థానంలో 'ప్రేమమ్' ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ వచ్చేసిందని ప్రచారం జరిగింది.
తను కూడా ఈ ప్రాజెక్ట్ కి టాటా చెప్పేసిందట. ప్రస్తుతం 'హిట్ 2' ఫేమ్ మీనాక్షీ దీక్షిత్ లేదా కేతిక శర్మలలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం వుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా సినిమా ప్రారంభం లోనే హీరోమయిన్ లు వాకౌట్ చేస్తూ బయటికి వెళ్లిపోవడానికి అసలు కారణం ఏంటని, ఎందుకు హీరోయిన్ లు ఈ మూవీలో నటించడానికి ఆసక్తిని చూపించడం లేదనే చర్చ మొదలైంది. ఇందు కు కారణం హీరో, రైటర్ సిద్దూ అని, అతనితో వుంటే ఇంటిమేట్ సీన్ వల్లేనని తెలుస్తోంది.
'డీజే టిల్లు'లో రాధిక పాత్రలో నటించిన నేహాశెట్టితో సిద్దూ జొన్నల గడ్డ లిప్ లాక్ సీన్ లు వున్న విషయం తెలిసిందే. అయితే సీక్వెల్ లో మాత్రం అంతకు మించి ఇంటిమసీ సీన్స్ వున్నాయట. అవే హీరోయిన్ లని భయపెడుతున్నాయని, సిద్దూతో అవి చేయలేకే వచ్చిన హీరోయిన్ వచ్చినట్టే సెట్ లో షూటింగ్ మొదలు కాకుండానే పారిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరో సిద్దూ జొన్నలగడ్డ ఈ మూవీకి రైటర్ కూడా తనే కావడంతో ఓ రేంజ్ లో ఇంటిమేట్ సీన్ లని రాసాడని చెబుతున్నారు.
ఆ సీన్ లలో నటించడానికి హీరోయిన్ లు ఇబ్బందిపడుతున్నారట. ఆ కారణం వల్లే ఏమీ చెప్పలేక .. ఆ సీన్ లలో నటించలేక హీరోయిన్ లు ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేస్తున్నారని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో గుసల గుసలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఆ సీన్ ల డోస్ తగ్గిస్తారో.. హీరోయిన్ గా మీనాక్షీ దీక్షిత్ , కేతిక శర్మలలో ఎవరిని ఫైనల్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.