Begin typing your search above and press return to search.
ఫ్యాషన్ వీక్ లో హంసల హొయలు
By: Tupaki Desk | 4 Feb 2019 6:25 AM GMTలాక్మే ఫ్యాషన్ వీక్ ముంబైని అదరగొడుతోంది. ప్యారిస్ ని కొట్టే రేంజులో ముంబై నగరంలో ఫ్యాషన్ వీక్ మోతెక్కిస్తోంది. ఈ వేడుక ఆద్యంతం టాప్ మోడల్స్ సహా పలువురు బాలీవుడ్ అందగత్తెల హంస నడకలతో అల్లాడిస్తున్నారు. ఇప్పటికే విద్యా బాలన్ - జాన్వీ కపూర్ - లీసా హెడెన్ - కరిష్మా - కరీనా - సోహా అలీఖాన్ - భూమి ఫెడ్నేకర్ - శిభాని దండేకర్ - వాణీ కపూర్ - మలైకా అరోరాఖాన్ - చిత్రాంగద సింగ్ - ఖుషీ కపూర్ - ఆలియాభట్ ఇలా టాప్ బ్యూటీస్ అక్కడ కొలువుదీరి ర్యాంప్ వాక్ లతో అలరించారు.
టాలీవుడ్ - సౌత్ ఇండస్ట్రీస్ నుంచి ఈసారి భారీ ఎత్తున ముద్దుగుమ్మలు ముంబై లాక్మే ఫ్యాషన్ వీక్ లో ప్రత్యక్షమయ్యారు. వీళ్లలో టాలీవుడ్ హాట్ బ్యూటీస్ పూజా హెగ్డే - అదితీరావ్ హైదరీ - ప్రగ్య జైశ్వాల్ - ప్రణీత - మీనాక్షి ధీక్షిత్ ఒకరేమిటి రంగు ప్రపంచం రామచిలుకలు ర్యాంప్ షోలో రఫ్ఫాడించేశారు.
ఈ వేడుకలోనే చిరుత గాళ్ బ్లాక్ అండ్ బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్ లో ప్రత్యక్షమై హొయలు పోయిన తీరు యువతరంలో హాట్ టాపిక్ అయ్యింది. ఫ్యాషన్ వీక్ ఆద్యంతం మానస సరోవరం నుంచి దారి తప్పిన హంసలు ఇలా వచ్చి వాలాయా? అన్నంతగా రంగుల మయం అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. ర్యాంప్ షోల్లో దాదాపు 50 మంది పైగా ముద్దుగుమ్మలు తమ అందచందాల ఎలివేషన్ తో మతి చెడగొట్టారంతే.