Begin typing your search above and press return to search.
వోగ్ 2019: నాటీ బూటీ వయ్యారి భామలు
By: Tupaki Desk | 26 Sep 2019 10:19 AM GMTవోగ్ బ్యూటీ అవార్డ్స్ 2019 వేడుకలు బుధవారం సాయంత్రం దిల్లీలో కలర్ ఫుల్ గా జరిగాయి. ఈ వేడుకల్లో ముంబై పరిశ్రమకు చెందిన పలువురు కథానాయికలు .. స్టార్ హీరోలు.. డిజైనర్లు సందడి చేశారు. ఇక ఈ వేదికపై ఆలియా భట్ ఉత్తమ బ్యూటీ పురస్కారం దక్కించుకోగా సారా అలీఖాన్ సహా రకుల్.. భూమి పెడ్నేకర్ వంటి హాటీలు రెడ్ కార్పెట్ నడకలతో అదరగొట్టారు. శిభానీ దండేకర్.. కరిష్మా తన్నా లాంటి ట్యాలెంటు కార్పెట్ పై అందాలు ఒలికించారు. ఇక ఇదే వేదిక వద్ద పూర్తిగా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో తెలుగమ్మాయి శోభిత ధూళిపాల అసలు గుర్తు పట్టలేనంత కొత్తగా తనని తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసింది.
ఈ వేడుకలో సీనియర్ భామలు శిల్పా శెట్టి.. తన సోదరి షమితా శెట్టి ఇంటర్వ్యూలతో పాటు రెడ్ కార్పెట్ నడకలతో దుమ్ము దులిపేశారు. క్లాసిక్ డేస్ కథానాయిక షర్మిలా ఠాగూర్ ఇక్కడ వేదిక వద్ద కనిపించారు. కథానాయకుల్లో విక్కీ కౌశల్ రెడ్ కార్పెట్ పై నడిచారు. మలైకా అరోరాఖాన్ - సోనాలి బింద్రే ఈ వేడుకలో రెడ్ కార్పెట్ నడకలతో ఆకట్టుకున్నారు. వోగ్ మ్యాగజైన్ పదో ఎడిషన్ వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డుల్ని అందించారు. వేడుక ఆద్యంతం నాటీ బూటీ వయ్యారి భామలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అయితే ఈసారి వేడుకల్లో సీనియర్ భామల్లో పలువురు మిస్సయిన లోటు కనిపించింది. ఐశ్వర్యారాయ్- కరిష్మా కపూర్ - మాధురి ధీక్షిత్- దీపిక పదుకొనే వంటి స్టార్లు గతంలో వోగ్ అవార్డ్స్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి ఈ భామలెవరూ కనిపించలేదెక్కడా.