Begin typing your search above and press return to search.
సెల్ఫీలకు హీరోయిన్స్ అంత తీసుకుంటారా?
By: Tupaki Desk | 4 Aug 2016 8:07 AM GMTఈమధ్య కాలంలో హీరోయిన్లు సెల్ఫీలు తీసుకుంటున్నట్లుగా తెగ పోజులు ఇచ్చేస్తున్నారు. ఏదో ఒక డిఫరెంట్ డ్రసింగ్.. లేదా మేకప్ వేసుకుని హంగామా చేసి సెల్ఫీ తీసుకుంటున్నట్లు పోజులిస్తున్నారు. ఆ సెల్ఫీ తీసుకుంటున్న ఫోజును వేరేవాళ్లతో ఫోటో తీయించిన సోషల్ సైట్లలో షేర్ చేయడం బాగా ఎక్కువైంది. ఇదంతా కమర్షియల్ కాన్సెప్ట్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
ప్రస్తుతం తమన్నా - కాజల్ - రెజీనా - తాప్సీ - బిపాసా బసు - నేహా శర్మ ఇలా అందరూ ఇలాంటి ట్వీట్లు వేస్తూనే ఉన్నారు. సాధారణంగా ఆయా మొబైల్ తయారీ కంపెనీలతో ట్వీట్ కి ఇంత అని రేటు మాట్లాడుకుని ఇలాంటి ట్వీట్స్ చేస్తూ ఉంటారు హీరోయిన్లు. కాసింత క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ఒక్కో ట్వీట్ కి 50వేల నుంచి 75వరకూ వసూలు చేస్తున్నారు. అయితే.. ఇదేమీ సింగిల్ ట్వీట్ తో తేలే వ్యవహారం కాదు. కనీసం 20 ట్వీట్లకు బంచ్ గా రేటు మాట్లాడుకుని.. ఓ రెండు నెలల గ్యాప్ లో ఈ ట్వీట్స్ చేస్తుంటారు. చిన్నపాటి హీరోయిన్స్ అయితే తక్కువగా రేటు ఉంటుంది. అయితే.. హీరోలు మాత్రం ఒక్కో ట్వీట్ కి కనీసం 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చీటికి మాటికీ సెల్ ఫోన్లతో పోజులు ఇచ్చేవ్యవహారం వాళ్లు చేయరు కాబట్టే ఇంత రేటు.
మొత్తానికి ఈ కమర్షియల్ ట్వీట్స్ తో హీరోయిన్స్ బాగానే సంపాదించుకుంటున్నారు. అయితే స్టార్ హీరోలు మాత్రం ఈ పేమెంట్ల కోసం తమ బ్రాండ్ ఇమేజ్ ను ఎందుకు డ్యామేజ్ చేసుకోవాలి అంటూ ఇలాంటివి వేయట్లేదు.