Begin typing your search above and press return to search.
హీరోయిన్ల హవా నడుస్తోంది
By: Tupaki Desk | 18 Aug 2018 1:30 AM GMTమాస్ హీరోల రాజ్యం మొదలయ్యాక తెలుగు సినిమాలో హీరోయిన్ల పాత్ర గ్లామర్ కోసమో లేకపోతే హీరో పక్కన పాటల్లో డాన్స్ చేయటం కోసమో ఉండేది. కానీ కాలం మారుతోంది. ప్రేక్షకులు కోరుకున్నారో లేక దర్శకులు కొత్త తరహాలో ఆలోచిస్తున్నారో మొత్తానికి ఈ మధ్య వచ్చిన సినిమాలు చూస్తుంటే వాటి విజయాల్లో హీరోయిన్లు కీలక పాత్ర పోషించడం మంచి పరిణామమే. దానికి ఉదాహరణలు చాలానే కనిపిస్తాయి. ఇప్పుడు సెన్సేషనల్ హిట్ దిశగా దూసుకుపోతున్న గీత గోవిందం టైటిల్ లో ఫస్ట్ ఉన్నది హీరోయిన్ పేరే. కథలో కీలకమైన మలుపుకు కారణం అవ్వడమే కాకుండా హీరోను డామినేట్ చేసే పాత్రలో రష్మిక మందన్న ఫుల్ మార్క్స్ కొట్టేసింది. దీని కన్నా ముందు వచ్చిన ఆరెక్స్ 100లో పాయల్ రాజ్ పుత్ కు ఎంత పేరు వచ్చిందో చూసాంగా. ఇందూ లేకుండా అందులో శివను చూడలేం. పంజాబీ అమ్మాయి అయినప్పటికీ పాయల్ చూపించిన ఎక్స్ ప్రెషన్స్ ఇప్పట్లో యూత్ మర్చిపోవడం కష్టమే.
ఇది ఇక్కడితో ఆగలేదు. మహానటి లో విజయ్ దేవరకొండ-దుల్కర్ సల్మాన్ లాంటి టాలెంటెడ్ యూత్ హీరోస్ ఉన్నప్పటికీ అందరు చూసింది కీర్తి సురేష్ నే. టైటిల్ రోల్ తనదే అయినప్పటికీ దానికి ప్రాణ ప్రతిష్ట చేసిన తీరు సావిత్రి గారే మళ్ళి వచ్చారా అనిపించేలా చేసింది. చలో మూవీలో ఇంటర్వెల్ నుంచి కథ కీలక మలుపు తిరిగేది హీరోయిన్ పాత్ర వల్లే. అందులో కూడా రష్మిక మందన్ననే ఉండటం విశేషం.తొలిప్రేమ లో వరుణ్ తేజ్ కు ధీటుగా రాశి ఖన్నా పాత్రను తీర్చిదిద్దడం ప్లస్ గా మారింది. భాగమతి ఎవరి వల్ల ఆడిందో చిన్న పిల్లాడిని అడిగినా అనుష్క పేరు ఠక్కున చెప్పేస్తాడు. రాబోయే యు టర్న్ లో సమంతా తప్ప ఇంకెవరు కనిపించేలా లేరు. అన్ని సినిమాలు అని చెప్పలేం కానీ మెజారిటీ సినిమాలను గమనిస్తే హీరోయిన్లకు ఇస్తున్న ప్రాధాన్యత సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది మంచి పరిణామమే.