Begin typing your search above and press return to search.

దీపం ఉండగానే భామల బిజినెస్

By:  Tupaki Desk   |   2 Jun 2017 5:44 AM GMT
దీపం ఉండగానే భామల బిజినెస్
X
పాకీజా ఫేమ్ బాలీవుడ్ సీనియర్ నటి గీతా కపూర్ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. వృద్ధాప్యంలో ఆమెను ఆస్పత్రిలో చేర్చిన కొడుకు.. ఆ తర్వాత మాయమైపోవడం.. 41 రోజుల పాటు తన పిల్లలు వస్తారని ఎదురుచూసిన ఆమె.. ఆ తర్వాత కన్నీళ్లతో ఓల్డ్ ఏజ్ హోమ్ కు చేరుకుంది.

చివరి వయసులో ఇలాంటి పరిస్థితి ఎదుర్కున్న వారు మన దగ్గర కూడా ఉన్నారు. సావిత్రి.. మాలతి.. హరనాథ్.. ఆర్ నాగేశ్వరరావు.. చిత్తూరు నాగయ్య.. కాంతారావు.. ఎస్ వీ రంగారావు.. రాజనాల.. ఛాయా దేవి లాంటి వాళ్లు కూడా చివర్లో ఇబ్బందులు పడ్డారు. నిర్మాతగా మారాక సావిత్రి పరిస్థితి ఎలా మారిందో చూశాక.. తాను జాగ్రత్తపడ్డం మొదలుపెట్టానంటున్నారు సీనియర్ నటి జమున. మనీ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని.. సొంతవాళ్ల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు చంద్రమోహన్.

ఈ తరం భామలు మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కెరీర్ కంటిన్యూ చేస్తూనే.. మరోవైపు వ్యాపారాల వైపు అడుగు పెడుతున్నారు. ఇటు హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే జ్యూవెలరీ వ్యాపారంలో అడుగు పెట్టింది తమన్నా. ప్రణీతా సుభాష్ ఇప్పటికే రెస్టారెంట్స్ ఓపెన్ చేసి వ్యాపారం చేసేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ బిజినెస్ లోకి దిగడం సంగతి తెలిసిందే. తాప్సీకి మ్యారేజ్ కన్సల్టెన్సీ వ్యాపారం ఉంది. గత తరం నేర్పిన పాఠాల సంగతేమో కానీ.. గుణపాఠాలను మాత్రం ఈ తరం హీరోయిన్లు బాగానే నేర్చేసుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/