Begin typing your search above and press return to search.

పాపలందరూ 'షార్ట్ కట్' ట్రెండ్ లోనే

By:  Tupaki Desk   |   26 May 2016 1:30 PM GMT
పాపలందరూ షార్ట్ కట్ ట్రెండ్ లోనే
X
సినీ సుందరాంగులు ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉండడం తప్పనిసరి. ట్రెండ్ ను ఫాలో అవకపోతే వెనకబడిపోతాం అనే ఫీలింగ్ బాగా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో సీజన్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు హెయిర్ స్టైల్ మీద భామలందరూ ఫోకస్ పెట్టేశారు.

సాధారణంగా ఎవరి స్టైల్ వారిదే వారిదే అన్నట్లు ఉండే ఈ సొగసరిలు.. హెయిర్ విషయంలో మాత్రం ఒకే పద్ధతిలో ఉంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న ఫ్యాషన్ ఏంటంటే.. షార్ట్ కట్. అదేనండీ హెయిర్ ని షార్ట్ గా కటింగ్ వేయించేయడం. బాలీవుడ్ - టాలీవుడ్ - కోలీవుడ్ అనే తేడాలేం లేవు. అందరూ ఇదే రూట్ లో ఉన్నారు. సమంత, శృతి హాసన్ - తమన్నా - హన్సిక - కాజల్ తోపాటు.. ప్రియాంక సహా బాలీవుడ్ భామలదీ ఇదే వరుస. దశాబ్దానికి పైగా పొడుగాటి జుట్టుతో ఆకట్టుకున్న త్రిష కూడా ఇప్పుడు షార్ట్ హెయిర్ రూట్ లోకి వచ్చేసిందంటే.. ఈ ట్రెండ్ ఏ రేంజ్ లో నడుస్తుందో అర్ధమవుతుంది.

ఆ మధ్య పవన్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ కూడా ఇలా తన హెయిర్ ని షార్ట్ చేసేసుకుంది. అయితే.. ఆమె కటింగ్ చేయించుకోవడం వెనుక.. తన జుట్టును కేన్సర్ పేషెంట్స్ కు దానం చేయాలనే కమిట్మెంట్ ఉంది. అలాగని అందరు సెలబ్రిటీలు పొట్టి జుట్టునే ఇష్టపడుతున్నారని కాదు. ఇంకా కొందరు తమ పొడుగాటి శిరోజాలతో ఆకట్టుకుంటూనే ఉన్నారు.