Begin typing your search above and press return to search.
ఓన్లీ గ్లామర్ ఉంటే ఆడదు బాబాయ్
By: Tupaki Desk | 8 July 2016 5:30 PM GMTకేవలం ఒక హీరోయిన్ గ్లామరసం ఉన్నంత మాత్రాన సినిమాలే ఆడేయవు. ఆ విషయం ఇప్పటివరకు చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు అందరూ యాంకర్ రష్మి గ్లామర్ పెద్దగా వర్కవుట్ కాలేదని అంటున్నారు కాబట్టి.. అసలు ఈ రసం ఎందుకు వర్కవుట్ అవుతుంది అనే యాంగిల్ లో ఓసారి చూసేద్దాం పదండి.
చాలా కాలం క్రితం.. తన హీరోయిన్ కెరియర్ చివర్లో ఉన్న సమయంలో.. కాంచన వంటి భామామణులు కాస్త హాటుగా ప్రయత్నించారు. కాని ఫలితం శూన్యం. 80లలో రాధ.. 90లలో రంభ.. రమ్యకృష్ణ.. విపరీతంగా ఎక్సపోజింగ్ఆ చేసిన సినిమాలు ఆడలేదు. తరువాత కాలంలో సాక్షి శివానంద్ వంటి హాటీలు గ్లామర్ తో గాట్టిగానే మెరిశారు కాని.. కంటెంట్ సరిగ్గా లేనప్పుడు సినిమాలు ఫ్లాపయ్యాయ్. ఒక్కసారి ఆమె ఆల్ర్టా హాటుగా నటించిన సినిమాల లిస్టు చూడండి మీకే తెలుస్తుంది. అప్పట్లో హీరోయిన్ సదా ఎంతో హాటుగా టక్కరి సినిమాలో అందాలు ఆరబోసింది. పాటలూ పోస్టర్లూ చూస్తే జనాలకు మతిపోయింది. కాని సినిమా పరిస్థితి ఏమైంది? ఈ తరంలో శ్రీయ మొన్నటికి మొన్న ఒక కాల్ గాల్ రోల్ లో నటించి మరీ ఆరబోసింది. కాని జనాలు తలుపులు వేసేశారు. ఇప్పుడు రష్మి పరిస్థితి అయినా అంతే.
గ్లామర్ కారణంగా ఓపెనింగ్ డే పొద్దున్నే సినిమా ధియేటర్ కు జనాలు వస్తారు. కాని అక్కడి నుండి సినిమా నిలబడాలంటే మాత్రం సినిమాలో కంటెంట్ ఉండాల్సిందే. అది లేకుండా ఓన్లీ గ్లామర్ కోసం సినిమాలు ఆడేస్తే.. మనోళ్ళు సన్ని లియోన్ వాళ్ల అక్కయ్యలను చాలామందిని దింపేశేవారే. అది బాబాయ్ సంగతి!!