Begin typing your search above and press return to search.

ఆ యాప్ లో హీరోల‌తో హీరోయిన్లు పిచ్చా పాటీ!

By:  Tupaki Desk   |   21 Jun 2021 7:30 AM GMT
ఆ యాప్ లో హీరోల‌తో హీరోయిన్లు పిచ్చా పాటీ!
X
గ‌త కొద్దిరోజులుగా ఓ కొత్త యాప్ గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ యాప్ పేరు క్ల‌బ్ హౌస్. ఫేస్ బుక్ - ఇన్ స్టా వంటి యాప్ ల‌కు ధీటుగా ఈ యాప్ కూడా దూసుకుపోయేందుకు ఛాన్సుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే ఈ యాప్ లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 25 మిలియ‌న్ల యూజ‌ర్లు క‌నెక్ట‌య్యారు. భార‌త‌దేశంలో 5 మిలియ‌న్ల మంది ఉండ‌గా.. 2 మిలియ‌న్ల మంది దీనిలో యాక్టివ్ గా ఉన్నార‌ట‌. ఇన్ స్టాల్ చేసుకుని గ్రూప్ డిబేట్ల‌ను న‌డిపిస్తున్నార‌నేది ఓ స‌ర్వే.

ఇక ఇటీవ‌లి కాలంలో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనూ క్ల‌బ్ హౌస్ యాప్ ప్ర‌ముఖంగా వైర‌ల్ అవుతోంది. క్లబ్ హౌస్ ట్విట్టర్ స్పేస్ లకు తెలుగు ప‌రిశ్ర‌మ‌లో లాగిన్ లు పెరుగుతున్నాయ‌ని తెలిసింది. కొన్ని వారాలుగా అనేక తెలుగు చలనచిత్ర ప్రముఖులు క్లబ్ హౌస్ ట్విట్టర్ వంటి వాటిని విరివిగా వినియోగించి సినిమాల గురించి సాధారణంగా సంభాషణల్లో పాల్గొనడానికి అన్వేషిస్తున్నారని తెలిసింది.

క్లబ్ హౌస్ అనేది ఆడియో మాత్రమే వినే అనువర్తనం. ఇది సినీ ప్రేమికులకు సినీ పరిశ్రమ సభ్యులకు పెద్ద స్థాయిలో స‌ద్వినియోగం అవుతోంది. ట్విట్టర్ లోనూ కొత్త‌ ఫీచర్ అందుబాటులో కి వ‌చ్చింది. ఇది సోషల్ మీడియా వేదిక‌ల‌పై ప్రత్యక్ష సంభాషణలను మ‌రింత‌ సులభతరం చేసింది. విక్ట‌రీ వెంక‌టేష్ లాంటి పెద్ద హీరో క్ల‌బ్ హౌస్ ని అనుస‌రిస్తున్నాయి. రాజ్ త‌రుణ్ స‌హా చాలామంది చిన్న హీరోలు ఫాలోవ‌ర్స్ గా ఉన్నారు. ఇక ఇదే యాప్ లో హీరోల‌తో హీరోయిన్లు పిచ్చా పాటీ మాట్లాడుకునేందుకు ఆస్కారం ఉందా? అంటే దానికి అనుభ‌వ‌జ్ఞులైన నాయిక‌లే స‌మాధాన‌మివ్వాలి!

ఇక ప్ర‌మోష‌న్స్ కోసం ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్ యూట్యూబ్ విరివిగా వినియోగిస్తున్నా కానీ క్ల‌బ్ హౌస్ యాప్ పూర్తి భిన్న‌మైన‌ద‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. సాంకేతిక‌త‌లో అప్ డేట్ కావాలి. అప్ప‌ట్లో వాట్సాప్ వ‌చ్చాక దానికి అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ పెరిగారు. ఇప్పుడు అది శాసిస్తోంది. మునుముందు కొన్ని సెక్ష‌న్ల‌కు క్ల‌బ్ హౌస్ మ‌రో వేదిక‌గా మార‌నుంద‌ని విశ్లేషిస్తున్నారు.