Begin typing your search above and press return to search.
గ్లామర్ ఇండస్ట్రీలో స్టోరీ మారుతోంది
By: Tupaki Desk | 30 Sep 2015 9:30 AM GMTఅడపాదడపా తప్పితే.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ రాని కల్చర్ మనది. అలాంటిది ఒకేసారి అనేక సినిమాలు హీరోయిన్ ప్రాధాన్యంగా తెరకెక్కుతున్నాయి. భామలందరూ తమ ట్యాలెంట్ తో పాటు మార్కెట్ ప్రూవ్ చేసుకునేందుకు విపరీతంగా కష్టపడ్డానికి వెనుకాడ్డం లేదు. మాకేం తక్కువ.. మేము కూడా వందకోట్ల వసూళ్లు సాధించగలమన్న కంగనా కామెంట్స్ కి బలం చేకూరుతోంది. ఇలా వస్తున్న సినిమాలేవీ.. ఏదో ఇలా వచ్చాయి వెళ్లాయి అనేట్లు కాకుండా.. ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు కావడం విశేషం.
ఈ హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో మొదటగా చెప్పాల్సింది అనుష్క నటించిన రుద్రమదేవి గురించే. మరో పది రోజుల్లో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్న ఈ మూవీ కోసం 70 కోట్లు ఖర్చు చేశారు. ఒకేసారి 3 భాషల్లో విడుదలవుతున్న ఈ చరిత్రాత్మక చిత్రం కోసం.. అనుష్క కత్తి యుద్ధాలు కూడా చేసేసింది. నయనతార ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మయూరి. పెట్టిన బడ్జెట్ తో లెక్కేస్తే దీన్నిబ్లాక్ బస్టర్ అనాలి. అంతే కాదు అసలు ఏ మాత్రం పబ్లిసిటీ లేకుండా.. ఇంత పెద్ద హిట్ సాధించడం విశేషం. కెరీర్ చివర్లో ఉందని అనుకుంటున్న సమయంలో నాయకి అంటూ త్రిష చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. ఓ చేతిలో కత్తి - మరోచేతిలో పూలసజ్జతో ఫస్ట్ లుక్ తోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది నాయకి త్రిష.
త్రిపుర అంటూ వస్తున్న కలర్స్ స్వాతి కూడా బాగానే భయపెడుతోంది. వచ్చిన ఆఫర్స్ అన్నీ అంగీకరించకుండా... ఏరి కోరి ఎంపిక చేసుకునే స్వాతి.. త్రిపుర చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో ఇరగదీయనుంది. రాజ్ కిరణ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గా అంజలి గురించి చెప్పుకోవాలి. చిత్రాంగద పేరుతో అంజలి ప్రధాన పాత్రలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. ఇప్పటికే గీతాంజలితో ఇదే జోనర్ లో సక్సెస్ కొట్టడంతో... అంజలిపై 10 కోట్లు ఖర్చుపెట్టేందుకైనా వెనుకాడ్డం లేదు నిర్మాతలు. ఇవన్నీ కూడా మంచి విజయం సాధిస్తే.. టాలీవుడ్ లోనే కాదు, దక్షిణాదిలోనే కొత్త ట్రెండ్ మొదలవ్వచ్చు.