Begin typing your search above and press return to search.
స్టార్ హీరో హీరోయిన్స్ ఆ విషయంలో దిగొస్తారా...?
By: Tupaki Desk | 16 April 2020 3:00 AM GMTకోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్తంగా మారిపోయింది. కరోనా ప్రభావం ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా ప్రతి రంగం మీద తన ప్రభావాన్ని చూపించింది. దీని వలన కలిగిన నష్టం అంచనా వేయలేని స్థితికి చేరింది. కరోనా ప్రభావం ఎక్కువగా పడిన రంగాల్లో సినీరంగం ఒకటి. దీని నుండి బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై వచ్చే ఏడాది చివరి వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తాజాగా లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించడంతో ఇప్పట్లో సినిమా బయటకి వచ్చే అవకాశం లేదని ఒక అంచనాకి వస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసి.. కరోనా తగ్గుముఖం పట్టినా సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి కొన్నేళ్ల సమయం పట్టేలా ఉంది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కూడా జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత తేలికైన విషయం కాదని ఇప్పటికే అర్థమైపోయింది.
ఇక నిర్మాతల విషయానికొస్తే సినిమాలు విడుదల కాక.. మేకింగ్ దశలో ఉన్న సినిమాల బడ్జెట్లూ పెరిగిపోయి.. షూటింగ్ లు ఆగిపోయి.. కరోనా దెబ్బకి నిర్మాత కుదేలైపోయాడని చెప్పవచ్చు. మరోవైపు కరోనా అనంతర పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా ఉండేటట్లు కనిపించడం లేదు. కొన్ని నెలల పాటు రెవెన్యూ నామమాత్రంగా ఉండబోతోంది. సినిమా థియేట్రికల్ బిజినెస్ మీద చాలా ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్లు తగ్గించకపోతే నిర్మాతల మనుగడే ప్రశ్నార్థకం అయ్యేలా కనిపిస్తోంది. ఒక సినిమా బడ్జెట్ పెరగడానికి ముఖ్యకారణం హీరో హీరోయిన్ల మితిమీరిన రెమ్యూనరేషన్స్ అని చెప్పవచ్చు. ఒక భారీ బడ్జెట్ సినిమాని ఉదాహరణగా తీసుకుంటే ఆ సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం వారి పారితోషకాలకే కేటాయిస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ తమకున్న డిమాండ్ దృష్ట్యా ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకే సినిమాలు చేస్తున్నారు. చివరికి సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వారి రెమ్యూనరేషన్స్ పెరిగిపోతున్నాయి. వాటితో పాటు లాభాల్లో వాటాలు తీసుకోవడం.. డబ్బింగ్ రైట్స్ అమ్ముకోవడం కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల నుండి నిర్మాతను గట్టెక్కించాలంటే హీరోహీరోయిన్స్ వాళ్ళ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆకాశాన్నంటుతున్న వారి పారితోషకాలు తగ్గించుకొని.. పాత ఒప్పందాల్ని రివైజ్ చేసుకుంటే తప్ప తాము కోలుకోలేమని నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన సినిమాలు బయటికి రావాలన్నా.. వాటి వల్ల తాము నష్టాల్లో కూరుకుపోకుండా ఉండాలన్నా.. హీరోలు కొంత మొత్తం పారితోషకం వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని కూడా నిర్మాతల్లో చర్చ నడుస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇండస్ట్రీ మొత్తం ఒక్కతాటిపై నడిస్తేనే మన టాలీవుడ్ మళ్ళీ పూర్వ స్థితికి వస్తుందని సినీ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.