Begin typing your search above and press return to search.
అందాల భామల అడ్రస్ మిస్ అయింది
By: Tupaki Desk | 27 April 2016 5:30 PM GMTఐపీఎల్ మ్యాచ్ లు అంటేనే ఆట కంటే గ్లామర్ షో ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ లీగ్ కి ఆడియన్స్ కనెక్ట్ అయింది ఇందుకే. ఛీర్ గర్ల్స్ చేసే సందడి ఓ రేంజ్ లో ఉంటే.. గ్యాలరీల్లో కూర్చుని హీరోయిన్స్ చేసే హంగామా మరో రేంజ్ లో ఉంటుంది. బాలీవుడ్ స్టార్స్ షారూక్ ఖాన్ - ప్రీతి జింటాలు టీం ఓనర్లు కావడంతో.. మ్యాచ్ లకు గ్లామర్ హంగులు బాగా దక్కేవి.
వీరందరి కంటే ఎక్కువగా హీరోయిన్లను స్టేడియంకి తెచ్చేవాడు విజయ్ మాల్యా. ప్రతీ సీజన్ లోనూ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ వచ్చి ఫ్యాన్స్ ని మైమరపించేవారు. కత్రినా కైఫ్ - దీపికా పదుకునే లాంటి బడా హీరోయిన్లు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జెర్సీలు వేసుకుని.. స్టేడియంలో తిరుగుతూ ఉండేవారు. ఇక విజయ్ మాల్యా - ఆయన కొడుకు సిద్ధార్ధలు అందాల భామలతో రాసుకుపూసుకు తిరగడం లాంటివి.. జనాలకు మాంచి హుషారునిచ్చేవి. ఈ సారి బడా మాల్యా లండన్ పారిపోవడంతో.. వీళ్లని ఆహ్వానించే వారే లేకపోయారు.
మరోవైపు ప్రీతి జింటా ఒక్కతే తన టీం ఆడే మ్యాచ్ ల సమయంలో హడావిడి చేస్తోంది. అది తప్ప బాలీవుడ్ గ్లామర్ మచ్చుకైనా కనిపించడం లేదు. హైద్రాబాద్ లో మ్యాచ్ లు జరుగుతున్న టైంలో వెంకటేష్ కనిపిస్తున్నాడు. అది కూడా తన వ్యక్తిగత ఇష్టంతోనే. కానీ హీరోయిన్లు మాత్రం ఎక్కడా అడ్రస్ కనిపించుట లేదు.