Begin typing your search above and press return to search.

యోగా డే నాడు యోగభామల నీతులు

By:  Tupaki Desk   |   21 Jun 2016 6:25 AM GMT
యోగా డే నాడు యోగభామల నీతులు
X
ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం. ఇప్పటికే యోగా ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను చెప్పేందుకు చాలానే కార్యక్రమాలు, ఈవెంట్ల నిర్వహణ జరగ్గా.. ఇప్పుడు వీటన్నిటికీ మించి ప్రపంచస్థాయిలో ప్రచారం చేసేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ఈ దినోత్సవం నిర్వహిస్తోంది. ఇప్పుడు మన సినిమా సుందరాంగులు కూడా తమ ఆరోగ్యాన్ని - శరీరాన్ని కాపాడుకునేందుకు యోగాకు ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తామో చెబుతున్నారు.

'యోగా ఎక్సర్ సైజ్ కాదు.. ఒక మెడిసిన్.. రోజు ఓ గంట సేపు యోగా చేస్తే మీ లైఫ్ లో బోలెడు మార్పులొస్తాయి' అంటోంది ఇలియానా. 'యోగాతో ఆరోగ్య సమస్యలు కూడా తీరతాయి. నా మెడకు క్రానిక్ స్పాండిలైటిస్ వచ్చినపుడు యోగా స్టార్ట్ చేశాను. దాని గొప్పతనం తెలుసుకుని ప్రచారం చేస్తున్నాను' అంటోంది శిల్పా శెట్టి. 'శరీరాకృతిలో మార్పు రాకుండా ఉండాలంటే యోగా చేయడం చాలా అవసరం' అంటోంది అమీషా పటేల్.

'పదేళ్లుగా హఠయోగ చేస్తున్నాను. ఏ మాత్రం ఒత్తిడి అనిపించినా రెండు ఆసనాలు వేస్తే చాలు రిలాక్స్ అయిపోతా' అంటోంది నర్గీస్ ఫక్రీ. 'నాకు రోజు యోగ తోనే ప్రారంభమవుతుంది. శరీరం మనసు అదుపులో ఉంచుకునేందుకు యోగ చేయాల్సిందే' అని చెప్పింది కరీనా కపూర్. 'యోగ అంటే ఆరోగ్యం మాత్రమే కాదు.. ఆరోగ్య పరివర్తన' అంటూ పెద్ద మాటలే చెప్పింది రాశిఖన్నా. 'వృత్తిపరమైన ఒత్తిళ్లు ఎదుర్కునేందుకు యోగా చేయాల్సిందే' అంటోంది హన్సిక. 'రోజుకు గంట చొప్పున వారానికి ఐదు రోజులు యోగా చేస్తాను. సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసి ఇతర ఆసనాలు వేస్తాను' అంటోంది శ్రీలంక అందం జాక్వెలిన్ ఫెర్నాండెజ్.