Begin typing your search above and press return to search.
మాకు పెళ్లి వద్ద అంటున్న స్టార్స్
By: Tupaki Desk | 11 Jun 2017 5:08 AM GMTమన బాలీవుడ్ లో కాని హాలీవుడ్లో కానీ పెళ్లికాని స్టార్స్ ఉన్నారు.. విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి వద్దు అనుకున్నాళ్లూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు అలానే బాగున్నట్లు ఉంది. విడిపోయిన జంట కూడ మళ్ళీ ఎక్కడైనా కలుసుకొన్నప్పుడు పాత స్నేహితులు లానే మాట్లాడుకొంటున్నారు.
బాలీవుడ్లో స్టార్ హెరోయిన్లు అయన సుష్మిత సేన్ - తబు సక్సెస్ అయన కూడ పెళ్లి చేసుకోకుండా సింగల్ గా లైఫ్ ని గడుపుతున్నారు. విడాకులు తీసుకొని సింగల్ గా ఉన్నవారు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఉదాహరణకు మనీషా కోయిరాల - పూజా బాత్రా - విక్రమ్ బట్ట్ - శేఖర్ కపూర్ లాంటి వాళ్ళు. ఇంకా కమల్ హాసన్ –గౌతమి - మలైకా అరోరా – అర్బాజ్ ఖాన్ - ఫరాన్ అక్తర్ – అధునా లాంటి వాళ్ళు విడిపోయి బాగానే ఉన్నారు. వీళ్ళు ఇలా ఎందుకు సింగల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారో ఇక్కడ కొద్ది మంది అభిప్రాయాలూ చెప్పారు.
బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా విడాకులు తీసుకొని చాలాకాలం అయినా పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉంది. “పెళ్లి అనేది ఆర్ధిక వెసులుబాటు కోసం చేసుకొనే ఒక ఒప్పందం కాదు. స్నేహం కోసం స్థిరత్వం కోసం జీవితాంతం ఒక తోడు కోసం చేసుకోవాలి. పిల్లలు అనే వారు పెళ్ళి అనే బంధాన్ని మరింత బలపరుస్తారు. జీవితం మరింత కుదురుగా ముందుకు వెళుతుంది. అంతే కాకుండా పెళ్లిని చాలామంది ఎందుకు వద్దు అనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఒక చట్రం లో పడి కొట్టుకుపోవడం ఇష్టంలేక. కానీ ఒకరి పై ఒకరికి నమ్మకం ఉంటే పెళ్లి బాగుంటుంది సమాజం కూడా బాగుంటుంది'' అని చెప్పింది.
ఇతర హీరోయిన్ల అభిప్రాయం కూడా అదే తరహాలో ఉందిలే. “ఒంటరిగా ఉంటే ఒక్కరి కింద సేవ చేసే అవసరం ఉండదు, ఒకరి కోసం ఎదురుచూసే పని ఉండదు. పెళ్లి అంటే కొన్ని నియమనిబంధనలు ఉంటాయి వాటిని తప్పకుండా పాటించాలి, కొన్నిసార్లు మనం చేయలేము అప్పుడు కష్టం అవుతుంది పెళ్లి బంధం. ఇంటిని నడపడం చాలా కష్టం'' అంటున్నారు. మరో బిజినెస్ లేడీ అభిప్రాయం బట్టి “ఒకే మనిషిని ఎప్పుడు ఒకేలా ప్రేమిచడం కుదరదు కొన్ని సార్లు తప్పులు జరుగుతాయి. మన అవసరాలు ఎప్పుడు ఒకటే అయి ఉండవు అవి మారుతాయి. వాటిని బట్టి మనం మారాలి'' అని చెబుతోంది.
మొత్తానికి వీళ్ళు మాటలు బట్టి స్నేహం కావాలి ప్రేమ ఉండాలి సౌఖ్యం పోకూడదు. విలువలు ఉండాలి ఇబ్బంది పడకూడదు. బాగుంది కొత్త సాఫ్ట్ వేర్ డిజైన్ చేసి తయారుచేద్దాం పదండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/