Begin typing your search above and press return to search.

కుమారి కోసం క్యూ కట్టిన హీరోయిన్లు

By:  Tupaki Desk   |   26 Oct 2015 6:46 AM GMT
కుమారి కోసం క్యూ కట్టిన హీరోయిన్లు
X
డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి.. తొలిసారిగా తీసిన చిత్రం కుమారి 21ఎఫ్. ఈ సినిమా డిఫరెంట్ గా ప్రమోట్ చేయడం కోసం ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది యూనిట్. అదే డబ్ స్మాష్. ఈ మూవీ టీజర్ లోని హీరోయిన్ డైలాగ్స్ ని చెప్పాల్సి ఉంటుంది పోటీదారులు.

స్టార్ హీరోయిన్స్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ కాంటెస్ట్ భలే రసవత్తరంగా మారిందిపుడు. మహేష్ తో కలిసి సుకుమార్ డైరెక్షన్ లో వన్ నేనొక్కడినే చిత్రంలో నటించిన క్రితి సనోన్.. నా పేరు కుమారి - నా ఏజ్ 21 - ఐ యామ్ ఏ ఫిమేల్.. అంటూ డబ్ స్మాష్ అదరగొట్టేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'నాన్నకు ప్రేమతో' మూవీలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెదవి కదిపింది.

వీళ్లిద్దరి ఉత్సాహం చూశాక.. మరింత మంది హీరోయిన్స్ వీరికి తోడయ్యారు. ప్రణీత - అనసూయ - రెజీనాలు కూడా అలరించేశారు. కుమారి 21ఎఫ్ ప్రమోషన్ లో భాగంగానే వీళ్లంతా డబ్ స్మాష్ బాట పట్టారని అర్ధమవుతున్నా.. ఒకే డైలాగ్ ని ఇంతమంది హీరోయిన్స్ చెప్తుంటే మాత్రం చూడ్డానికి భలే ఎక్సైటింగ్ గా ఉందని చెప్పచ్చు.