Begin typing your search above and press return to search.
స్పెషలిస్టులకు 25.. హీరోయిన్లకు 50 పైనే
By: Tupaki Desk | 9 Oct 2016 5:30 PM GMTజయమాలిని.. జ్యోతిలక్ష్మి.. విజయలక్ష్మి.. డిస్కో శాంతి.. సిల్క్ స్మిత.. ఒకప్పుడు ఐటెం సాంగులు అంటే వీళ్లే చేసేవారు. తరువాత అల్ఫోన్సా అండ్ ముమాయత్ ఖాన్ వంటి భామలు వీరిని రీప్లేస్ చేసేశారు అనుకునేవారు. కాని ఇప్పుడు కాలం మారింది. ఐటెం బాంబ్ చేస్తే ఐటెం అంటున్నారు కాబట్టి.. హీరోయిన్ తో చేయించి దానిని స్పెషల్ సాంగ్ అంటున్నారు. ఇలియానా.. శ్రీయ.. శృతిహాసన్.. తమన్నా.. కాజల్.. ఇలా అందరూ ఐటెంలు చేసినవారే. అయితే ఈ ఐటెమ్స్ వెనుక అసలు మతలబు ఏంటో తెలిసిందేగా.
మామూలుగా స్పెషలిస్టు ఐటెం సాంగుల బేబీలకైతే మనోళ్ళు ఒకప్పుడు 25 లక్షలు ఇచ్చేవారట. ముమాయత్ ఖాన్ అయినా.. లేకపోతే హంసా నందిని అయినా కూడా.. పాతిక ఇస్తే చాలు. ఆ తరువాత శ్రద్దా దాస్ వంటి చిన్న చిన్న హీరోయిన్లు.. రోజుకు 2 లక్షల కాన్సెప్టుతో రంగంలోకి దిగి.. మూడురోజులు షూట్ అంటే 6 లక్షలకు డీల్ ఓకె అనేశారు. అయితే హీరోయిన్ల విషయంలో మాత్రం లెక్కలు వేరండోయ్. కోటి రూపాయలు అడ్వాన్సు తీసుకున్న తమన్నా.. బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమాలో నటించకుండా.. రెండు సినిమాల్లో రెండు ఐటెం సాంగులు చేయడానికి ఒప్పుకుంది. అంటే 50లక్షలు ఒక్క పాటకు తీసుకున్నట్లు. అలాగే కాజల్ అండ్ శృతి కూడా.. తమ ఐటెం సాంగులకు 50 లక్షలు అందుకున్నారని నిర్మాతల సన్నిహితులు చెబుతున్నారు. ఆ మధ్యన సరైనోడులో అంజలి కూడా ఐటెం చేసినందుకు 40 లకారాలు పుచ్చుకుందట. అంటే స్పెషలిస్టు భామలకు 25 చేతిలో పెట్టే మన నిర్మాతలు.. హీరోయిన్లు అనేసరికి 50 పెట్టేస్తున్నారు.
కాకపోతే ఇప్పటివరకు మనం చూసిన ఇలాంటి హీరోయిన్ ఐటెం సాంగుల్లో కేవలం జనతా గ్యారేజ్ లో కాజల్ మాత్రం అందాలతో ఉతికి ఆరేసింది. తక్కిన హీరోయిన్ల పాటలు మాత్రం యావరేజ్ గానే ఉన్నాయని చెప్పాలి. అదే తమన్నా అయితే మామూలుగా సినిమాలో పాటలు చేసినా అలాంటి కాస్ట్యూమ్సే వేస్తుంది.. ఐటెం సాంగులు అన్నా అవే కాబట్టి.. పెద్ద తేడా తెలియలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/