Begin typing your search above and press return to search.

ఆడదే ఆది పరాశక్తి అంటున్నాడు

By:  Tupaki Desk   |   17 Aug 2015 6:22 PM GMT
ఆడదే ఆది పరాశక్తి అంటున్నాడు
X
టాలీవుడ్‌ సినిమాలన్నీ మేల్‌ డామినేటెడ్‌. హీరో చుట్టూనే కథలు తిరుగుతాయి. హీరోయిన్‌ అందాలు ఆరబోయడానికే పరిమితం. అయితే అలాంటి ట్రెండ్‌ నడుస్తున్న టైమ్‌ లోనే గౌతమ్‌ మీనన్‌ తనదైన చిత్తశుద్ధితో కథానాయిక పాత్రలకు కొత్తదనాన్ని అద్దాడు. తన సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, హీరోయిన్‌కి అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఘర్షణ సినిమాలో వెంకటేష్‌ (తమిళ్‌ లో సూర్య నటించాడు) పాత్ర ఎంత కీలకమో, అశిన్‌ పాత్ర కూడా అంతే కీలకం. ఎంతో అందంగా ఉంటుందా పాత్ర.

ఇక ఏ మాయ చేశావె సినిమాలో చైతన్య పాత్ర తో జెస్పీ పాత్ర పోటీపడుతూనే ఉంటుంది. సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాల్లోనూ అంతే ప్రాధాన్యత కథానాయికకు ఉంటుంది. హీరోయిన్‌ పాత్రల్ని అలా మలచడానికి గౌతమ్‌ చెప్పిన కారణం కూడా అంతే అందంగా ఆకట్టుకుంది. 'నేను మహిళల్ని అగౌరవపరచలేను. కించపరచలేను' అని అన్నారాయన. నేను తెరకెక్కిస్తున్న తాజా చిత్రాల్లోనూ హీరోయిన్‌ రోల్‌ బలంగా ఉంటుంది. కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌, చైతన్య సినిమా రెండిటిలో నాయికకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. తొలిసారిగా తీసిన 'చెలి' (మిన్నలే ) చిత్రం నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నానని అన్నారు.

నిజానికి ఇలా ఫిమేల్‌ సెంట్రిక్‌ సినిమాలను తీయకపోయినా ఫిమేల్‌ చుట్టూ తిరిగే స్ర్కిప్టులు రాయడం అనేది చాలా పెద్ద విషయమే. చాలా తక్కువమంది దర్శకులు మాత్రమే అలాంటి సినిమాలను తెరమీదకు తెస్తున్నారు. అది సంగతి.