Begin typing your search above and press return to search.
హీరొయిన్ల కొరతతో టాలీవుడ్ విలవిల!
By: Tupaki Desk | 8 July 2019 4:24 AM GMTఒకప్పుడు సావిత్రి-జమున-కృష్ణకుమారి లాంటి హీరోయిన్లకు దశాబ్దాల కెరీర్ ఉండేది. వాళ్లకు పెళ్ళైనా అవకాశాలకు కొదవ ఉండేది కాదు. కారణం ఒక్కటే. అప్పుడు రూపొందిన వాటిలో అధిక శాతం కుటుంబ కథా చిత్రాలు కావడమే. దాని వల్ల పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి తప్ప గ్లామర్ షోకు ఛాన్స్ లేకపోయేది. కానీ కాలక్రమేణా వచ్చిన మార్పుల వల్ల ఐటెం సాంగ్స్ కూడా హీరోయిన్లే చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. టాలెంట్ కన్నా ఎక్కువ అందం డామినేట్ చేస్తేనే ఆఫర్స్ ఇచ్చే దర్శక నిర్మాతలు పెరిగిపోతున్నారు.
సరే ప్రేక్షకులు కోరిందే ఇస్తున్నారు కాబట్టి దీన్ని తప్పుబట్టడానికి లేదు కానీ నిజానికి ఇదంతా సర్దుడు వ్యవహారం. హీరోల సంఖ్య ఎంత పెరుగుతున్నా అంతే నిష్పత్తిలో హీరోయిన్లు రావడం లేదు. వచ్చినా ఆశించిన స్థాయిలో అందమో నటనో లేకపోవడం లేదా ఆ రెండు ఉన్నాయి అనుకుంటే తక్కువ టైంలోనే డిమాండ్ పెంచేసి ప్రొడ్యూసర్లకు గుండెపోటు తెప్పించడమొ చేస్తున్నారు.
ఇప్పుడీ కొరత ఏ స్థాయిలో ఉందంటే ఇద్దరు మీడియం రేంజ్ స్టార్ హీరోల సినిమాలు కేవలం దీని వల్లే రెండు మూడు నెలలు ఆలస్యంగా షూటింగ్ ప్రారంభించాల్సి వచ్చింది. ఆ మధ్య పాతిక సినిమాలు పూర్తి చేసుకున్న ఓ సీనియర్ హీరోకు జోడి దొరక్కపోతే బ్రతిమాలి అంతకు ముందు చేసిన సినిమాలో హీరోయిన్ కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పించాల్సి వచ్చిందట.
ఇలాంటి ఉదాహరణలు ఇప్పుడు బోలెడు ఉన్నాయి. తమన్నా-త్రిష-శ్రేయ-నయనతార లాంటి వాళ్ళు పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నా ఇంకా డిమాండ్ కొనసాగుతోంది అంటే కొత్తగా వస్తున్న వాళ్ళు ఎలా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో అర్థం కావడం లేదని భవిష్యత్తులో జాబ్ కన్సల్టెన్సీ లాగా హీరోయిన్లను అందించే సంస్థలు వచ్చే పరిస్థితి ఉందని ఓ సీనియర్ నిర్మాత కామెంట్ చేయడం గమనార్హం.