Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్టులో ఎలా ఉన్నారో చూడండి

By:  Tupaki Desk   |   17 Sept 2017 4:54 PM IST
ఎయిర్ పోర్టులో ఎలా ఉన్నారో చూడండి
X
సాధారణంగా కొందరు హీరోయిన్స్ ని మేకప్ లేకండా చూడాలంటే చాలా ధైర్యం కావాలి. సినిమాల్లో ఎప్పుడు మెరుస్తూ ఉండే ముద్దు గుమ్మలు బయట కూడా అప్పుడపుడు మేకప్ టచ్ బాగానే ఇస్తుంటారు. అయితే కొందరు భామలు మాత్రం మేకప్ లేకున్నా చాలా బావుంటారు. వారి పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటారో తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిని కూడా చూపుతూ ఉంటారు. ఇక పొరపాటున వారి ఫొటోలు బయట పడితే సోషల్ మీడియాలో వారి అందాల మీద అనేక కథనాలు వెలువాడుతాయి.

ఇప్పుడు అదే తరహాలో ఇద్దరి టాప్ హీరోయిన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వారు ఎవరో కాదు ఒకరు సౌత్ మిల్కి బ్యూటీ తమన్నా కాగా .. మరొకరు బాలీవుడ్ స్మైలీ సుందరి శ్రద్దా కపూర్. ఈ ముద్దుగుమ్మలిద్దరూ రీసెంట్ ఎయిర్ పోర్ట్ లో సింపుల్ గా కనిపించే సరికి కెమెరాలు ఫ్లాష్ లైట్స్ తో వెలిగిపోయాయి. ఎక్కడికి వెళుతున్నారో తెలియదు గాని తమన్నా - శ్రద్దా కపూర్ సింపుల్ గా నార్మల్ టీ-షర్ట్ జీన్స్ లలో దర్శనం ఇచ్చారు.తెరమీద గ్లామర్ డ్రెస్సులతో అందాలని చూపించే ఈ భామలు సడన్ గా ఇలా కనిపించేసరికి వారి పర్సనల్ లైఫ్ ఇంత సింపుల్ గా ఉంటుందా అని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక శ్రద్దా కపూర్ సాహో సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.. అలాగే తమన్నా నార్త్ లో ఒక సినిమాతో సౌత్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది. జై లవ కుశలో ఆమె చేసిన స్వింగ్ జరా సాంగుకు మంచి ఊపొచ్చింది.