Begin typing your search above and press return to search.
భామల కోసం వెయిటింగ్ తప్పట్లే
By: Tupaki Desk | 17 Jun 2017 5:10 AM GMTఫిలిం ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉంటారు. హీరోలకు అయినా భాషా బౌండరీలు ఉంటాయి కానీ.. హీరోయిన్లు మాత్రం అన్ని భాషల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుని కెరీర్ ని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయినా సరే ఫిలిం మేకర్స్ కు హీరోయిన్ల కోసం ఎదురుచూపులు చూడక తప్పడం లేదు.
ప్రస్తుతం తాప్సీ హీరోయిన్ గా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో ఆనందో బ్రహ్మ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ హారర్ కామెడీ చిత్రంలో నటించేందుకు తాప్సీ ఏడాదికి క్రితమే సిద్ధపడ్డా.. డేట్స్ లేకపోవడంతో.. దర్శకుడిని వెయిటింగ్ లో పెట్టక తప్పలేదు. తన కోసం ఎదురుచూసినందుకు థ్యాంక్స్ అంటోంది తాప్సీ పన్ను. వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతున్న ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సాయిపల్లవికి ఆరు నెలలకు పైగా సమయం పట్టింది.
గతేడాది వచ్చిన జ్యో అచ్యుతానంద చిత్రంలో నటించేందుకు ఒప్పుకునేందుకు రెజీనా కసాండ్రా 3 నెలలకు పైగా సమయం తీసుకుంది. అసలు పూర్తి స్క్రిప్ట్ వినేందుకే 3 నెలల టైం తీసుకోవడం విశేషం. ప్రేమమ్ తెలుగు వెర్షన్ లో నటించేందుకు మడొన్నా సెబాస్టియన్ కూడా ఎక్కువ సమయాన్నే తీసుకుంది. అయితే.. హీరోయిన్లకు పాత్ర నచ్చితే చేసేందుకు ఇష్టపడతారని.. కానీ వారికి అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ కారణంగా..వెంటనే డేట్స్ ఇవ్వడం సాధ్యపడకపోవచ్చని చెబుతున్నారు మేకర్స్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/