Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: భామ‌ల‌ క‌ళ్ల‌లో కోటి భావాలు ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   7 Sep 2019 1:30 AM GMT
టాప్ స్టోరి: భామ‌ల‌ క‌ళ్ల‌లో కోటి భావాలు ఎక్క‌డ‌?
X
క‌థానాయిక అంటే అర్థం? కేవ‌లం గ్లామ‌ర్ ఉంటే స‌రిపోతుందా? క‌ళ్ల‌తోనే కోటి భావాలు ప‌లికించాలి. సంద‌ర్భాన్ని బ‌ట్టి ముఖ క‌వ‌లిక‌ల్ని.. శ‌రీర‌భాష‌ను మార్చేయాలి. గొప్ప న‌టిగా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకోవాలంటే కేవ‌లం గ్లామ‌ర్ ఎలివేష‌న్ మాత్ర‌మే స‌రిపోదు. న‌ట‌న‌- అభిన‌యం- ఆంగికం-వాచ‌కం .. ఇవ‌న్నీ అనుస‌రించాలి. అయితే నేటిత‌రంలో ఈ త‌ర‌హా బేసిక్స్ ని ఫాలో అవుతూ న‌టించేది ఎవ‌రు? అంటే స‌రైన ఆన్స‌ర్ ఇవ్వ‌లేం. క‌త్రిన‌- అనుష్క లాంటి స్టార్లు కూడా కెరీర్ ఆరంభం ముఖంలో హావ‌భావాలు మిస్స‌య్యాయ‌న్న విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్నారు. చాలా సినిమాలు చేశాక కానీ అభిన‌యంలో ప‌రిణ‌తి క‌నిపించ‌లేద‌ని అభిమానులే విశ్లేషిస్తారు. కేవ‌లం అందం ఉంటే స‌రిపోదు.. అభిన‌యంతో పాటు జిమ్నాస్టిక్ ఫీట్స్ తో శ‌రీరాకృతిని ప‌క్కాగా మెయింటెయిన్ చేస్తేనే నేటి ట్రెండ్ లో క‌థానాయిక‌గా రాణించే వీలుంటుంది. వీటిలో ఏది మిస్స‌యినా స్టార్ డ‌మ్ అందుకోవ‌డం అంత సులువేమీ కాదు.

నాటి త‌రంతో పోలిస్తే ఇప్పుడు అంతా మారింది. ఇక‌పోతే జ‌న‌రేష‌న్ వైజ్ ప‌రిశీలిస్తే.. సావిత్రి-జ‌మున‌- శ్రీ‌దేవి-జ‌య‌ప్ర‌ద‌- వాణిశ్రీ‌- భానుప్రియ ఇలా నాటి మేటి క‌థానాయిక‌లు అంద‌చందాల్లోనే కాదు.. గొప్ప అభిన‌యంతో మైమ‌రిపించారు. క‌ళ్ల‌తోనే కోటి భావాలు ప‌లికించ‌డం ఎలానో శ్రీ‌దేవి- భానుప్రియ లాంటి స్టార్లు నేర్పించారు. జ‌య‌సుధ‌- రాధిక స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌కు కేరాఫ్ అడ్రెస్ గా నిల‌వ‌డం ఒక ట్రెండ్. విజ‌య‌శాంతి- రాధ వీళ్లంతా గ్లామర్ ఎలివేష‌న్ తో పాటుగా న‌ట‌న‌లోనూ స‌త్తా చాటారు. త‌మ‌కంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్కున్నారు. అప్ప‌ట్లో క‌థ‌లు వేరు. వాళ్ల పాత్ర‌ల తీరుతెన్నులు వేరు.. న‌టించే స్కోప్ కూడా ఉండేది. అందువ‌ల్ల ఇదంతా సాధ్య‌మైంది.

నేటిత‌రం ప‌రిస్థితేంటి? అంటే నిరూపించుకోవాలంటే నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాల వ‌ర‌కే న‌టించే స్కోప్ ఉంటుంద‌నేది చాలా మంది యంగ్ బ్యూటీస్ ఆవేద‌న‌. కాస్తా సీనియారిటీ వ‌చ్చేస్తే.. కెరీర్ ష‌టిల్డ్ గా ఉంటే చాలు.. గ్లామ‌ర్ డాళ్స్ పాత్ర‌ల‌కే అంకిత‌మ‌య్యే కంటే త‌మ‌కు పేరు తెచ్చే చిన్న సినిమాలు అయినా న‌టించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. అగ్ర‌నాయిక‌లు అందుకే లేడీ ఓరియెంటెడ్ అంటూ కొత్త దారి వెతుక్కుంటున్నారు. న‌య‌న‌తార‌- అనుష్క‌- అంజలి- సాయి ప‌ల్ల‌వి- కీర్తి సురేష్ వీళ్లంతా ఇదే బాట‌లో వెళుతున్నారు. కాజ‌ల్ - త‌మ‌న్నా సైతం ఇలానే రూటు మార్చారు. ఇక యంగ్ జ‌న‌రేషన్ లో చాలా మంది గ్లామ‌ర్ యాంగిల్ నే చూపించాల్సిన ప‌రిస్థితి. తొలుత ఆర్థికంగా నిల‌దొక్కుకునే తాప‌త్ర‌యంలో గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌కు అంగీక‌రిస్తున్నారు. లాంగ్ స్టాండింగ్ సాధ్య‌ప‌డితే ఆ త‌ర్వాత న‌టించేందుకు స్కోప్ ఉన్న పాత్ర‌ల్ని వెతుక్కుంటున్నారు. క‌థానాయిక అంటే గ్లామ‌ర్ ఒక్క‌టే కాదు. న‌టిగా నిరూపించుకోవాలి. ఈ జ‌న‌రేష‌న్ సినిమాల గురించి న‌టీమ‌ణుల గురించి వ‌చ్చే జ‌న‌రేష‌న్ కూడా చెప్పుకోగ‌ల‌గాలని చాలా మంది నాయిక‌లు త‌మ వ్యూని చెబుతుంటారు. సావిత్రి- జ‌మున-శ్రీ‌దేవి వంటి సీనియ‌ర్ తార‌ల్ని గుర్తు పెట్టుకున్న‌ట్టే త‌మ‌ను ప‌ది కాలాల పాటు గుర్తు పెట్టుకోవాలని నేటిత‌రం నాయిక‌లు భావిస్తున్నారు. అయితే ఆ స్థాయి ఉన్న పాత్ర‌లు త‌మ‌కు ద‌క్కేది చాలా త‌క్కువ‌. అంత పెద్ద స్థాయిని అందుకోవాలంటే కీర్తి సురేష్- నిత్యామీన‌న్ లా అంద‌రికీ సాధ్యం కాక‌పోవ‌చ్చు. అందుకే చాలా మంది న‌వ‌త‌రం నాయిక‌లు ఇక్క‌డ కెరీర్ బండి న‌డిపించ‌లేక మ‌ధ్య‌లోనే మాయం అవుతున్నారు. కొంద‌రు బి గ్రేడ్ సినిమాల్లోనూ న‌టిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. మ‌ల్లూ భామ‌లు.. ముంబై బొమ్మ‌లు తెలుగ‌మ్మాయిల్ని డామినేట్ చేయ‌డం వెన‌క తెర‌వెన‌క ఇంకా ఎన్నో కార‌ణాలు ఉన్నాయి. భానుప్రియ‌- శ్రీ‌దేవి- జ‌య‌ప్ర‌ద రేంజు నేటిత‌రం తెలుగమ్మాయిల‌కు ద‌క్క‌క‌పోవ‌డానికి కార‌ణాలపైనా .. విస్త్ర‌తంగా చ‌ర్చ సాగాల్సి ఉంది.