Begin typing your search above and press return to search.

హీరోయిన్ కు వార్నింగ్ ఇస్తున్న శ్రేయోభిలాషులు!

By:  Tupaki Desk   |   21 Dec 2016 5:30 PM GMT
హీరోయిన్ కు వార్నింగ్ ఇస్తున్న శ్రేయోభిలాషులు!
X
తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక హాట్ టాపిక్ తెగ హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే... ఒక హీరోయిన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారట ఆమె అభిమానులు. ఇంతకూ ఆమెకే పనిగట్టుకుని ఎందుకు వార్నింగ్స్ ఇస్తున్నారంటారా? అక్కడే ఉంది అసలు విషయం. టాలీవుడ్ లో ఒక హీరోయిన్ లేటెస్ట్ గా ఒక యంగ్ హీరోతో సినిమా చేయడానికి కమిటైందట. ఆ వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ ఆమెకు వరుసగా మెసేజ్ లు వస్తున్నాయట.

నువ్వు సినిమా చేయబోతున్న ఆ యంగ్ హీరో ఏమాత్రం మంచివాడు కాదని, పైగా విపరీతమైన అమ్మయిల పిచ్చోడని - ఆ హీరోతో సినిమా చేస్తే కెరీర్ నాశనం అయిపోతుందని హెచ్చరికలు జారీచేస్తున్నారట. అయితే ఈ సినిమా ప్రకటన వచ్చినప్పుడు ఆ యంగ్ హీరో వెంటనే ఆమెతో దిగిన ఫోటోని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పోస్ట్ చేశాడు. దాంతో వరుసపెట్టి ఆమెకు మెసేజ్ లు రావడం మొదలయ్యాయట. దీంతో కంగారు పడిన ఆ హీరోయిన్ నేరుగా ఆ హీరోతోనే చర్చించిందట.

ఈ విషయం తెలుసుకున్న ఆ యంగ్ హీరో.. తనకు ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యపోయాడట. అనంతరం తేరుకుని.. ఇలాంటి విషయాలన్నీ లైట్ తీసుకోవాలని, తన యాంటీ ఫ్యాన్స్ ఎవరో కావాలని చేస్తున్న పనే ఇది అని నచ్చచెప్పాడట. అయితే ఆ హీరోకు ఇండస్ట్రీలో నిజంగానే ప్లే బోయ్ ముద్ర ఉండటంతో ఇలాంటి మెసేజ్ లు వచ్చి ఉంటాయని ఆమె శ్రేయోభిలాషులు భావిస్తున్నారట. సో... ఆమె ఫ్యాన్స్ హెచ్చరించిన దాంట్లో ఎంతోకొంత నిజం ఉందని, తనతో చేసిన హీరోయిన్స్ ని ముగ్గులోకి లాగుతాడని అతనిపై ఇప్పటికే టాక్ ఉందని నిర్ధారణకు కూడా వచ్చారట. ప్రస్తుతం ఇదే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ఓ హాట్ రూమర్. ఇంతకీ ఆ యంగ్ హీరో హీరోయిన్స్ ఎవరైఉంటారా అని ఈ వార్త తెలిసినవారు జుట్టు పీక్కుంటున్నారట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/