Begin typing your search above and press return to search.
షార్ట్ టైమ్‌లో ఫేమ్ అయ్యారు కానీ.. అంతలోనే..!
By: Tupaki Desk | 31 Oct 2022 3:30 AM GMTసినిమాల్లో హీరోలకు తప్ప హీరోయిన్ లకు లాంగ్ రన్ వుండదన్నది తెలిసిందే. చాలా వరకు హీరోలు ఇపస్పటికీ తమ కెరీర్ ని ఎప్పటిలాగే కొనసాగిస్తున్నా హీరోయిన్ లు మాత్రం తెరమరుగైపోయారు. కానీ కొంత మంది హీరోయిన్ లు మాత్రం కెరీర్ పరంగా ఫేడవుట్ అవుతున్న కానీ ఇప్పటికీ వరుస ఆఫర్లని దక్కించుకుంటూ లైమ్ లైట్ లో కొనసాగుతుండటం విశేషం. అయితే వీరి తరువాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంత మంది మాత్రం మళ్లీ రైజ్ కాలేకపోతున్నారు.
త్రిష నుంచి రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నాల వరకు ఫాస్ట్ గా ఫేమ్ ని నేమ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ లలో చాలా మంది ఇప్పటికీ అవకాశాల్ని దక్కించుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. గత కొంత కాలంగా ఫాస్ట్ గా నేమ్ ని ఫేమ్ ని దక్కించుకున్న కొంత మంది హీరోయిన్ లు అంతే ఫాస్ట్ గా ఫేడవుట్ అయిన సందర్భాలున్నాయి. అయితే గత దశాబ్దా కాలంగా ఇండస్ట్రీలో వుంటున్న వారికి మాత్రం ఇప్పటికీ అవకాశాలు వస్తుండటం విశేషం.
నయనతార, త్రిష, సమంత, తమన్నా, రాశీఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్ లు తమ స్థాయికి తగ్గ ఆఫర్లని ఇప్పటికీ దక్కించుకుంటూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. తమన్నా ఈ మధ్య కొంఒత వరకు ఫేడవుట్ అయినా సరే మళ్లీ పుంజుకుంటోంది.. వరుస అవకాశాల్ని దక్కించుకుంటోంది. రాశీఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా మళ్లీ అవకాశాల్ని సొంతం చేసుకుంటూ లైమ్ లైట్ లో వుంటున్నారు.
అయితే ఒకే ఒక్క సినిమాతో వండర్ అనిపించుకున్న హీరోయిన్ లు మాత్రం వెంటనే ఫేడవుట్ అయిపోతున్నారు. 'ఉప్పెన' సినిమాతో తొలి ప్రయత్నంలోనే బ్లాక్ హిట్ ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించిన కృతిశెట్టి ఆ తరువాత ఆ స్థాయి సక్సెస్ లని సొంతం చేసుకోలేకపోతోంది. ఫేమ్ ని కోల్పోయింది. 'డిజే టిల్లు'తో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న నేహాశెట్టి వన్ ఫిల్మ్ వండర్ గానే మిగిలిపోయింది. 'ఇస్మార్ట్ శంకర్'తో తిరుగులేని ఇమేజ్ ని దక్కించుకున్న కన్నడ సోయగం నభా నటేష్ మరో సినిమాకోసం నానా పాట్లు పడుతోంది.
షార్ట్ టైమ్ లో ఫేమ్ అయిన హీరోయిన్ లు మళ్లీ ఆ స్థాయిలో ఆకట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్న వేళ ఈ తరహాలో ఫేమ్ ని దక్కించుకున్న రష్మిక మందన్న మాత్రం అదే జోరుని చూపిస్తూ క్రేజీ హీరోయిన్ గా టాప్ స్లేస్ లోకి చేరిపోయింది.
సీనియర్ హీరోయిన్ లలో చాలా మందికి ఇప్పటికీ అవకాశాలు వస్తున్నా ఈ మధ్య కాలంలో షార్ట్ టైమ్ లో ఫేమ్ ని దక్కించుకున్న హీరోయిన్ లు మళ్లీ ఆ స్థాయి సక్సెలు దక్కక ఫేడవుట్ అవుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.