Begin typing your search above and press return to search.
తండ్రీకొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీరే..!
By: Tupaki Desk | 26 July 2022 11:30 PM GMTమేల్ డామినేషన్ ఉండే సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోయిన్ కెరీర్ అయినా కొన్నేళ్ళు మాత్రమే. హీరోలు మాత్రం లీడ్ రోల్స్ చేస్తూనే ఉంటారు కానీ.. కథానాయికలు మాత్రం అలా కాదు. ప్రారంభంలో యంగ్ హీరోలతో రొమాన్స్ చేసినా.. ఆ తర్వాత సూపర్ సీనియర్ హీరోలకు జోడీగా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొందరు అందాల భామలు అటు తండ్రి తోనూ ఇటు కొడుకులతోనూ రొమాన్స్ చేశారు.
మొదట్లో కొడుకు పక్కన హీరోయిన్ గా నటించి ఆ తర్వాత తండ్రి సరసన నటించిన వారున్నారు. అలానే తండ్రికి హీరోయిన్ గా నటించి.. మళ్లీ అతని తనయుడితోనూ కథానాయికగా నటించిన అరుదైన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగులో తండ్రీకొడుకులతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం!
అతిలోక సుందరి శ్రీదేవి.. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మరియు ఆయన కుమారుడు యువసామ్రాట్ నాగార్జునల సరసన హీరోయిన్ గా నటించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఏఎన్నార్ కు జోడీగా కనిపించిన శ్రీదేవి.. 'ఆఖరి పోరాటం' 'గోవిందా గోవిందా' సినిమాల్లో నాగ్ తో రొమాన్స్ చేసింది. అలానే హిందీలో 'మిస్టర్ బెచరా' 'ఖుదాగవా' వంటి సినిమాల్లో నాగార్జున - శ్రీదేవి జంటగా నటించారు.
అలనాటి హీరోయిన్ రాధ కూడా అక్కినేని తండ్రీకొడుకులతో కలసి నటించింది. నాగేశ్వరరావుతో ఆదర్శవంతుడు - గోపాలకృష్ణుడు - వసంతగీతం చిత్రాల్లో నటించిన రాధ.. నాగార్జున తో కలిసి 'విక్కీ దాదా' సినిమా చేసింది. అలానే నందమూరి తండ్రీకొడుకులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఘనత కూడా రాధా కి దక్కింది. 'చండశాసనుడు' సినిమాలో ఎన్టీఆర్ తో నటించిన రాధ.. ఆయన కుమారుడు బాలకృష్ణ సరసన కూడా హీరోయిన్ గా చేసింది. 'నిప్పులాంటి మనిషి' 'ముద్దుల క్రిష్ణయ్య' 'కలియుగ కృష్ణుడు' 'రాముడు భీముడు' 'దొంగ రాముడు' వంటి సినిమాల్లో బాలయ్యతో హీరోయిన్ గా నటించింది రాధ.
చందమామ కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన కొడుకు రామ్ చరణ్ ఇద్దరితోనూ హీరోయిన్ గా నటించింది. చరణ్ తో 'మగధీర' 'నాయక్' 'గోవిందుడు అందరివాడేలే' సినిమాల్లో నటించగా.. చిరు తో 'ఖైదీ నెం 150' చిత్రంలో నటించిందీ అమ్మడు. మెగా తండ్రీకొడుకులు భాగమైన 'ఆచార్య' సినిమాలోనూ కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు కానీ.. చివరికి ఆమె పాత్రను ఎడిటింగ్ లో లేపేశారు.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా మెగా తండ్రీకొడుకులతో రొమాన్స్ చేసింది. రామ్ చరణ్ తో 'రచ్చ' సినిమాలో నటించగా.. 'సైరా నరసింహా రెడ్డి' చిత్రంలో చిరంజీవికి జోడీగా నటించింది. ప్రస్తుతం 'భోళాశంకర్' మూవీలోనూ చిరు కి హీరోయిన్ గా చేస్తోంది. ఇక నాగచైతన్య తో '100% లవ్' 'తడాఖా' సినిమాల్లో నటించిన తమన్నా.. నాగార్జున నటించిన 'ఊపిరి' సినిమాలో ఆయనకు సహాయకురాలి పాత్రలో కనిపించింది.
డెహ్రాడూన్ బ్యూటీ లావణ్య త్రిపాఠి కూడా అక్కినేని తండ్రీ కొడుకులతో రొమాన్స్ చేసింది. నాగ్ సరసన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాలో నాగ్ కు జోడీగా కనిపించిన లావణ్య.. ఆ తర్వాత 'యుద్ధం శరణం' సినిమాలో నాగచైతన్య తో రొమాన్స్ చేసింది. అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన 'మనం' సినిమాలోనూ ఆమె భాగమైంది. 'బంగార్రాజు' చిత్రంలో అవకాశం వచ్చినా.. చైతూ కి తల్లిగా కనిపించాలి కాబట్టి, ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓవైపు నాగ చైతన్య మరోవైపు నాగార్జున తో నటించింది. 'రారండోయ్ వేడుక చూద్దాం' లో చై కి జోడీగా కనిపించిన రకుల్.. 'మన్మథుడు 2' మూవీలో నాగ్ తో హీరోయిన్ గా నటించింది. లిప్ లాక్ కిస్సింగ్ సీన్స్ లో నటించడమే నటించి.. రెచ్చిపోయి రొమాన్స్ చేసింది.
లక్ బ్యూటీ శృతి హసన్ కూడా మెగా తండ్రీకొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్ల జాబితాలో చేరబోతోంది. 'ఎవడు' సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించిన శృతి.. ఇప్పుడు చిరంజీవి సరసన 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో ఆడిపాడుతోంది.
ఇలా వీరంతా టాలీవుడ్ లో తండ్రీకొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు జాబితాలో ఉన్నారు. ఇదే క్రమంలో ఒకే ఫ్యామిలీ హీరోలతో కలిసి నటించిన కథానాయికలు కూడా చాలా మందే ఉన్నారు.