Begin typing your search above and press return to search.
క్రేజీ డైరెక్టర్లుకు శాపంగా మారుతున్న స్టార్స్!
By: Tupaki Desk | 13 July 2022 2:30 AM GMTకెరీర్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని, స్టార్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేయని వారంటూ వుండరు. అలా ప్రయత్నాలు చేసిన వాళ్లు చాలా మందే సక్సెస్ అయి క్రేజీ డైరెక్టర్లు గా స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న వాళ్లు టాలీవుడ్ లో చాలా మందే వున్నారు. అయితే ఈ మధ్యే స్టార్ల కొంత మంది దర్శకులకు శాపంగా మారుతున్నారట. ఇది తాజాగా కొంత మంది క్రేజీ డైరెక్టర్ ల ఈ విషయంలో నిజమైంది కూడా.
స్టార్ హీరోతో సినిమా చేస్తే కెరీర్ లో ఉన్నత స్థాయిని సొంతం చేసుకుంటామని ఆశపడిన దర్శకులు చాలా మంది పరిస్థితి ఇప్పుడు అయోమయ స్థితికి చేరింది. వివరాల్లోకి వెళితే.. 'రన్ రాజా' రన్ అనే మీడియం బడ్జెట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు సుజీత్. ఈ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేయాలని యాక్షన్ కథతో 'సాహో' మూవీని రూపొందించాడు.
ఓ ఫ్రెంచ్ మూవీ కాపీ కథ అంటూ విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా దక్షిణాదిలో పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. కానీ ఉత్తరాదిలో మాత్రం రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించకపోవడం, ఫ్రెంచ్ మూవీకి కాపీలా వుందనే విమర్శలు వినిపించడంతో సుజీత్ కు ఇప్పటి వరకు మరో సినిమా దక్కలేదు. ప్రస్తుతం చిన్న హీరోలతో సినిమాలు చేసే అవకాశం వున్నా ఈయన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ లేక ఖాలీగానే వున్నాడు.
ఇదే దర్శకుడి తరహాలో 'జిల్'తో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ కుమార్ తన రెండవ ప్రాజెక్ట్ ని ప్రభాస్ తో చేశాడు. అదే 'రాధాశ్యామ్'. వందల కోట్ల బడ్జెట్ తో దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని అందించింది. దర్శకుడిగా భారీ ప్రాజెక్ట్ ని డీల్ చేయలేడనే విమర్శలని అందించింది. దీంతో ఈ దర్శకుడికి ప్రస్తుతం మరో సినిమా లేదు. ప్రస్తుతం ఖాలీగానే వున్నాడు.
వీళ్లిద్దరి జాబితాలో తాజాగా మరో దర్శకుడు చేరాడు. వీరి తరహాలోనే స్టార్ హీరోతో సినిమా చేయాలని,దాని ద్వారా స్టార్ డైరెక్టర్ ల జాబితాలో చేరాలని ఆశపడిన దర్శకుడు పరశురామ్. నాగచైతన్యతో ప్రాజెక్ట్ ఫైనల్ అయినా సరే ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి మహేష్ తో సినిమా చేయడం తన డ్రీమ్ గా భావించి 'సర్కారు వారి పాట' చేశాడు. మైత్రీతో పాటు 14 ప్లస్ రీల్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఇటీవల విడుదలై మహేష్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది.
ఈ మూవీ ప్రారంభంలో చాలా మంది పరశురామ్ ఈ భారీ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయలేడంటూ విమర్శలు చేశారట. అయినా సరే మహేష్ ముందుకు వెళ్లాడట. కానీ ఫలితం రివర్స్ కొట్టడంతో ఇప్పడు పరశురామ్ తో సినిమాకు ఏ హీరో ముందుకు రావడం లేదు. కథ చెప్పి ఫైనల్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య కూడా ఆ మూవీని పరశురామ్ తో చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో పరశురామ్ ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో వున్నాడట.
కథ విన్న హీరో ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు రాకపోవడంతో ఇతర హీరోలు కూడా పరశురామ్ కు ముఖం చాటేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని దూకుడుగా వెళ్లిన డైరెక్టర్ల కెరీర్ కు ఇప్పడు అదే స్టార్ హీరోలు శాపంగా మారడం విచిత్రంగా వుందని ఇండస్ట్రీలో కామెంట్‌లు పేలుతున్నాయి.