Begin typing your search above and press return to search.
హీరోల సీక్రెట్ కాన్ఫరెన్స్ కాల్ లో ఏం జరిగింది?
By: Tupaki Desk | 21 April 2020 2:30 AM GMTఇండస్ట్రీలో పరిస్థితులు మారిన సమయంలో సినీ పెద్దలు అంతర్గతంగా చర్చించుకోవడం సాధారణమైన విషయం. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినీరంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యంగా థియేటర్లు మూతపడడం.. కొంతకాలం పాటు థియేట్రికల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో అర్థంకాని పరిస్థితిలో ఈమధ్య కొందరు స్టార్ హీరోలు.. కొందరు డబ్బు ఉన్న మీడియం రేంజ్ హీరోలు సీక్రెట్ గా ఒక కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుకున్నారట.
కొన్నేళ్ల క్రితం అల్లు అర్జున్.. రానా దగ్గుబాటిల ఆధ్వర్యంలో ఇలాంటిదే ఒక సీక్రెట్ మీటింగ్ జరిగింది. అయితే ఆ మీటింగ్ లో మీడియాని ఎలా రెగ్యులేట్ చేయాలి అనేది మెయిన్ ఎజెండా. అయితే తాజాగా జరిగిన కాన్ఫరెన్స్ కాల్ లో మెయిన్ అజెండా.. వీరందరూ కలిసి ఒక ప్రొడ్యూసర్ల గిల్డ్ ని స్థాపించడం.. ఎవరికి వారే సొంతంగా సినిమా నిర్మాణాలు చేపట్టి ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు అమ్మడం. కరోనా క్రైసిస్ కారణంగా దాదాపు రెండేళ్లపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ కోలుకునేలా కనిపించడంలేదని కొన్ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయంలో 75% కోత పడనుందని కూడా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ లోటుని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కొంత మేర భర్తీ చేస్తాయి. అందుకే ఈ హీరోలంతా నిర్మాతల్ని పక్కన పెట్టాలని.. వారి చెప్పు చేతల్లో నడుచుకునే నమ్మకస్తుల్ని ఈ గిల్డ్ కి అధినేతలుగా పెట్టి షో నడిపించాలని అనుకుంటున్నారట. ఈ నమ్మకస్తులతో ఇండస్ట్రీని వారి చెప్పు చేతల్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ హీరోల దృష్టిలో నిర్మాతలంటే కేవలం సినిమా డిస్ట్రిబ్యూషన్.. థియేట్రికల్ బిజినెస్ వ్యవహారాలకు మాత్రమే పనికి వస్తారనే అభిప్రాయం ఉంది. ఇప్పడు ఎలాగూ థియేట్రికల్ బిజినెస్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి వారితో పెద్దగా పని ఉండదని భావిస్తున్నారట. నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ చేయాలంటే మెయిల్ పెట్టడం వస్తే చాలని.. వాటిని తమకు నమ్మకంగా ఉండే వాళ్ళు చేసి పెడతారని భావిస్తున్నారట. అందుకే మన తెలుగు హీరోల్లో కొందరు ఇప్పుడు నిర్మాతలుగా మారడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇదంతా బాగానే ఉంది కానీ నిర్మాతలు ఇదంతా చూస్తూ ఊరుకుంటారా అనేది ఆలోచించాల్సిన అంశం.