Begin typing your search above and press return to search.

హీరోల్లేక హీరోయిన్ తో చేశారట

By:  Tupaki Desk   |   31 March 2018 2:30 AM GMT
హీరోల్లేక హీరోయిన్ తో చేశారట
X
మంచి కథ ఉంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం... ఈ మాటలు మన దగ్గరే కాదు.. బాలీవుడ్ లోనూ వినిపిస్తుంటాయి. కానీ డిఫరెంట్ స్టోరీతో సినిమా చేయడానికి సిద్ధపడే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఐదేళ్లపాటు ఓ సినిమా చేయడానికి హీరోల కోసం వెతుక్కుని చివరకు హీరో క్యారెక్టర్ ని హీరోయిన్ గా మార్చి సినిమా తీసి హిట్ కొట్టాను అంటున్నాడు హిచ్ కీ సినిమా డైరెక్టర్ సిద్ధార్ధ్ పి.మల్హోత్రా.

బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ చాలా కాలం తరవాత నటించిన మూవీ హిచ్ కీ. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకున్నాక నటనకు బైబై చెప్పేసింది. కూతురు పుట్టాక ఆమె పెంపకంలో బిజీ అయిపోయింది. ఇన్నాళ్లకు ఓ డిఫరెంట్ స్టోరీతో వచ్చిన హిచ్ కీ సినిమాలో నటించింది. ఇందులో టొరెట్ సిండ్రోమ్ తో బాధపడే టీచర్ గా ఆమె కనిపించింది. మెదడులో లోపాల కారణంగా హఠాత్తుగా ఆమె నోటివెంట ఆమెకే తెలియని విచిత్రమైన శబ్దాలు వచ్చేస్తుంటాయి. ఇలాంటి మహిళ టీచర్ గా ఎలా రాణించింది అన్నదే హృదయానికి హత్తుకునేలా తీశాడు సిద్ధార్ధ్ మల్హోత్రా.

‘‘ఈ సినిమా స్క్రిప్ట్ పట్టుకుని ఐదేళ్లపాటు తిరిగా. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా సూచన మేరకు మనీష్ శర్మను కలిశా. ఆయన ఇచ్చిన ఐడియా మేరకే హీరో పాత్రను హీరోయిన్ గా మార్చేశా. అది రాణికి నచ్చడంతో హిచ్ కీ తెరకెక్కించగలిగా’’ అని సినిమా వెనుక ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చాడు సిద్ధార్ధ్. మొత్తానికి ఐడియా బాగానే వర్కవుట్ అయింది