Begin typing your search above and press return to search.
గ్రాండ్ మస్తీ.. ఇక అందరూ మటాష్
By: Tupaki Desk | 2 Sep 2015 3:51 PM GMTమాటల్లో ద్వంద్వార్థం, విజువల్స్‌లో క్లీవేజ్ షోలు ఇలాంటివి ఉంటే ఆ సినిమాల్ని బుల్లితరపై ప్రసారం చేయడం నిలిపేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరహాలోనే అప్పట్లో పెద్దల కోసం తీసిన గ్రాండ్ మస్తి చిత్రాన్ని బుల్లితెరపై ప్రసారం చేయొద్దని జీ గ్రూపును ఆదేశించింది హైకోర్టు. ఏపీ కేంద్రంగా నడిచే మీడియా వాచ్ సంస్థ ఉపాధ్యక్షుడు ఈదర గోపీచంద్ వేసిన పిటిషన్ ను విచారించిన అనంతరం ఢిల్లీ హైకోర్టు ఈ నిర్ణయం వెలువరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ విచారణను సెప్టెంబర్ 16 కు వాయిదావేశారు.
పిల్లలను చెడు దారి పట్టించే అసభ్యకరమైన సినిమాల్ని బుల్లితెరపై ప్రసారం చేయకూడదని కోర్టు ఆదేశించింది. సెన్సార్ సర్టిఫికేషన్ ఉన్నంత మాత్రాన అది బుల్లితెరకు అనర్హం కాదని చెప్పింది. గ్రాండ్ మస్తీలో ద్వంద్వార్థాలూ, అత్యంత అభ్యంతరకరమైన అంశాలూ ఉన్నాయి. అలాంటి సినిమాకి సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ ఎలా ఇచ్చింది అని పిటిషనర్ వాదించారు. పెద్దలతో కలిసి పిల్లలు చూడదగ్గ సినిమానా? అని న్యాయవాదులు వాదించారు. పిల్లలు టీవీ చూసే వేళల్లో పెద్దలు ఉండాలని రూలేం ఉంది అన్న వాదన సాగింది. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సెన్సార్ బోర్డ్) కు నోటీసులు జారీచేస్తూ, సెప్టెంబర్ 16 లోగా సమాధానాలివ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు వెలువడితే తెలుగు సినిమాలకు ప్రకంపనలు మొదలైనట్టే.
ఇప్పటికే న్యూడ్ కంటెంట్ ఉన్న చాలా సినిమాలకు ఇది పెద్ద సవాల్ లాంటిది. ఈ ఏడాది ఇప్పటికే క్రేజీ సినిమాలు రిలీజ్‌లకు రెడీ అవుతున్నాయి. మరీ న్యూడిటీని నమ్ముకుని తీసే చవకబారు సినిమాలకు ఇక నుంచి శాటిలైట్ దక్కడం అన్నది అసాధ్యం. ఈ తీర్పు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈనెల 16 డెడ్‌లైన్. ఇప్పటికే సెట్స్‌లో బూతు సినిమాలు ఏవైనా ఉంటే వాటిని ఆపేయడమే మంచిదని కొందరు ఇప్పటికే విశ్లేషిస్తున్నారు.