Begin typing your search above and press return to search.
వర్మకు పంచ్ పడింది
By: Tupaki Desk | 10 May 2017 4:36 PM GMTఅసలే సర్కార్-3 సినిమాపై అంతగా హైప్ లేదు. పైగా సినిమా ఒకటికి రెండుసార్లు వాయిదా పడింది. ఇంకోసారి తేడా వస్తే.. అంతే సంగతులు. అందుకే రామ్ గోపాల్ వర్మ రాజీ పడ్డట్లున్నాడు. బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం నీలేష్ గిర్కార్ అనే రచయితకు సర్కార్-3 సినిమా టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వడానికి.. అతడికి పెండింగ్ ఉన్న పారితోషకాన్ని చెల్లించడానికి అంగీకరించాడు వర్మ.
సర్కార్-3 కథ తనదే అని.. ఐతే తనకు క్రెడిట్ ఇవ్వకపోవడమే కాక పారితోషకంలోనూ కోత పెట్టాడంటూ వర్మ మీద కోర్టుకెక్కాడు నీలేష్. ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి.. నీలేష్ సమర్పించిన స్క్రిప్టును పరిశీలించడంతో పాటు సర్కార్-3 ప్రివ్యూ కూడా చూశారు. అనంతరం తీర్పు వెలువరించారు. నీలేష్ కు టైటిల్ క్రెడిట్ ఇవ్వడంతో పాటు పెండింగ్ ఉన్న రూ.6.2 లక్షల పారితోషకం ఇచ్చేయాలని ఆదేశించారు.
సర్కార్-3 ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ వివాదాన్ని పొడిగించడం ఎందుకని నీలేష్ కు పూర్తి పారితోషకం ఇవ్వడంతో పాటు రచయితగా టైటిల్ క్రెడిట్ కూడా వర్మ అంగీకరించాడు. దీంతో ఈ కేసుకు తెరపడింది. సర్కార్.. సర్కార్ రాజ్ సినిమాలకు కొనసాగింపుగా వస్తున్న సర్కార్-3లో అమితాబ్ తో పాటు మనోజ్ బాజ్ పేయి.. యామీ గౌతమ్.. అమిత్ కీలక పాత్రలు పోషించారు.