Begin typing your search above and press return to search.
మహర్షి కి హైకోర్ట్ షాక్
By: Tupaki Desk | 11 May 2019 8:32 AM GMTథియేటర్ల మెయింటెన్స్ పెరిగిన కారణంగా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలంటూ చాలా రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంను థియేటర్ల యాజమాన్య సంఘం కోరుతున్న విషయం తెల్సిందే. ప్రభుత్వం నిర్ణయం తీసుకోక పోవడంతో హైకోర్టును వారు ఆశ్రయించారు. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ టికెట్ల రేటు పెంపకం గురించిన అవసరం, దాని వల్ల ప్రేక్షకులు పడే ఇబ్బందులు తెలుసుకుని ప్రభుత్వంకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయితే కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయాలు వెళ్లడించక పోవడంతో పాటు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో థియేటర్ల యాజమాన్యాలు ఆగ్రహంతో ఉన్నారు.
తాజాగా 'మహర్షి' చిత్రం విడుదల నేపథ్యంలో సినిమా టికెట్ల పెంపు కోసం మరోసారి హైకోర్టును థియేటర్ల సంఘం వారు ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు థియేటర్ల సంఘం వారి విజ్ఞప్తిని తోసి పుచ్చింది. థియేటర్ల సంఘం వారు తప్పనిసరిగా స్టేట్ సినిమా చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందే అని, ప్రభుత్వం వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వంను ఆదేశించలేం అంటూ హైకోర్టు షాక్ ఇచ్చింది.
సినిమా విడుదలకు ముందు నుండి కూడా టికెట్ల రేట్ల పెంపకం విషయంలో థియేటర్ల సంఘం వారు మరియు నిర్మాతలు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. అయితే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం రేట్ల పెంపకంకు అనుమతించలేదు. ఆమద్య అనుమతించిందని వార్తలు వచ్చిన వాటిని వెంటనే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ఖండించాడు.