Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: బాబు బ్యాచ్ కు దడ పుట్టేలా హైకోర్టు నిర్ణయం
By: Tupaki Desk | 19 March 2019 10:43 AM GMTఎవరికి వారు.. వారు అనుకున్న విషయాల్ని ప్రజలకు చేరవేసే హక్కు ఉంటుంది. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో మాధ్యమాన్ని ఎంపిక చేసుకుంటారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాను చెప్పాలనుకున్న అంశాన్ని సినిమాల రూపంలో ఆయన చెప్పటం తెలిసిందే. కాకుంటే ఆయన తీసుకునే నిర్ణయాలు.. మాటలు.. చేతలు అన్ని సంచలనంగా ఉండటం తెలిసిన విషయమే.
తెలుగువారి ప్రియతమ నేత.. దివంగత ఎన్టీవోడి జీవితకథ ఆధారంగా రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఒక సినిమాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి నిర్ణయం వివాదాస్పదం కావటమే కాదు.. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ టీడీపీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎవరెన్ని ఒత్తిళ్లు పెట్టినా.. తాను అనుకున్న కథను.. అనుకున్నరీతిలో తీసిన ఆయన ఎవరేం చేసినా సరే.. తాను చెప్పిన సమయానికి సినిమాను విడుదల చేస్తానని ప్రకటించారు.
ఒకవేళ తనను చంపేస్తే.. ఈ సినిమా కాపీని ఇప్పటికే సిద్ధం చేశానని.. అవసరమైతే దాన్ని యూట్యూబ్ లో విడుదల చేస్తానని చెప్పటం తెలిసిందే. తన సినిమాను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు చెప్పారు. అయితే.. విడుదలలో సెన్సార్ బోర్డు జోక్యంతో ఈ సినిమా విడుదల మార్చి 29కి వాయిదా పడింది.
ఇదిలా ఉండగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని.. దీని కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందంటూ ఒక వ్యక్తి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ పిటిషన్ ను కొట్టివేసింది. ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన కోర్టు.. ఈ సినిమా విడుదలను ఆపాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో.. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలకు ఎలాంటి అవాంతరం లేనట్లే. ఈసినిమా విడుదలను ఎన్నికల పోలింగ్ వరకూ ఆపాలని భావించిన బాబు బ్యాచ్ కు హైకోర్టు తాజా నిర్ణయం షాకింగ్ గా మారుతుందని చెప్పక తప్పదు.