Begin typing your search above and press return to search.
సినిమా టికెట్ల వ్యవహారంలో హైకోర్టు కీలక మెలిక..!
By: Tupaki Desk | 16 Dec 2021 7:44 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35 పై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని రద్దు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ.. ఏపీ గవర్నమెంట్ తరపున అడ్వకేట్ జనరల్.. డివిజన్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
సినిమా టికెట్ ధరల వ్యవహారంపై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఈరోజు గురువారం వాదనలు జరిగాయి. సినిమా టికెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును థియేటర్ల యాజమాన్యాలకు ఇచ్చిన న్యాయస్థానం.. కీలక మెలిక పెట్టింది. లైసెన్స్ జారీచేసే అధికారి అయిన జాయింట్ కలెక్టర్ కు థియేటర్ల యజమానులు టికెట్ ధరల ప్రతిపాదనలపై ముందస్తు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. టికెట్ ధరలపై జేసీ నిర్ణయం తీసుకుంటారని సూచించింది.
అంతేకాదు సినిమా టికెట్ రేట్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరలను ఉద్దేశిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పై విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది.
కాగా, సినీ వినోదం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని.. ప్రేక్షకులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఏపీలో టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
దీనిపై కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ హైకోర్టుకు వెళ్లారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. థియేటర్లలో టికెట్ రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
ఇంతకుముందు అమలులో ఉన్న రేట్ల ప్రకారమే సినిమా థియేటర్లను నిర్వహించుకోవచ్చంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సినిమా జారీ అయిన జీవోకు ముందు అమలులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఎదుట ఏపీ ప్రభుత్వం బుధవారం అప్పీల్ దాఖలు చేసింది. ఈ క్రమంలో నేడు వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.