Begin typing your search above and press return to search.

టికెట్ల పై ప్ర‌భుత్వ పోర్ట‌ల్ స‌రికాదన్న‌హైకోర్ట్‌!

By:  Tupaki Desk   |   26 April 2022 2:38 PM GMT
టికెట్ల పై ప్ర‌భుత్వ పోర్ట‌ల్ స‌రికాదన్న‌హైకోర్ట్‌!
X
కోర్టుల ప‌రిధిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి దెబ్బ మీద దెబ్బ త‌గులుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సినిమా టికెట్ల విష‌యంలో ప్ర‌భుత్వ‌ పోర్టల్ ప్లాన్ ను హైకోర్టు తప్పు పట్టింది. థియేటర్ల యజమానులు తమ సొంత సెటప్ వెబ్ సైట్ల ద్వారా టిక్కెట్లు విక్రయిస్తే తప్పేంటని కోర్టు ప్రశ్నించింది. వచ్చే సోమవారం నాటికి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు కోరారు. లేనిపక్షంలో సంబంధిత జీవో అమలును తామే నిలిపివేస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా- న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సినిమా టికెట్ల‌ను ప్ర‌యివేట్ పోర్ట‌ల్స్‌లో విక్ర‌యించ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌పై అధిక ధ‌రాభారం ప‌డ‌ట‌మే గాక ప్ర‌భుత్వానికి ప‌న్ను ఎగ‌వేత‌లు పెచ్చు మీరాయ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం వాదించింది. అందువ‌ల్ల‌నే ప్ర‌భుత్వం సొంత పోర్ట‌ల్ ని ఏర్పాటు చేయాల‌ని భావించింది. కానీ కోర్టుల ప‌రిధిలో తాజా తీర్పు ప్ర‌తికూలంగా మారింది. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను ఏ ద‌శ‌లోనూ సినీప‌రిశ్ర‌మ స్వ‌గ‌తించ‌లేదు. కానీ ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ఏర్పాటు విష‌యంలో పంపిణీ వ‌ర్గాలు నిర్మాత‌లు అభ్యంత‌రం చెప్ప‌లేదు. కానీ ఏపీ ప్ర‌భుత్వంపై హైకోర్టు తీర్పు పెద్ద పంచ్ లా మారింద‌న్న టాక్ వినిపిస్తోంది.

మ‌రో వివాదంపైనా విచార‌ణ‌

సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 17న జారీ చేసిన జీఓ 142ను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరపున మంజీత్ సింగ్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం థియేటర్ యాజమాన్యాల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని అన్నారు. ఈ కేసు సోమవారం హైకోర్టులో మరోసారి విచారణకు రానుంది. పన్ను ఎగవేతలను అరికడతామని ఫిల్మ్‌ డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌ రూపొందించిన పోర్టల్‌ ద్వారా టిక్కెట్ల విక్రయానికి ప్రభుత్వం పూనుకుంది.