Begin typing your search above and press return to search.

డీజేపై హైకోర్టు విచారణ ఇవాళే

By:  Tupaki Desk   |   27 Jun 2017 4:38 AM GMT
డీజేపై హైకోర్టు విచారణ ఇవాళే
X
డీజే- దువ్వాడ జగన్నాధం మూవీ విడుదల తర్వాత సంచలనాల మాటేమో కానీ.. రిలీజ్ కి ముందు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'అస్మైక యోగ తస్మైక భోగ' పాటలో ఉపయోగించిన కొన్ని పదాలను.. వాక్యాలను తొలగించాలంటూ బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేయడమే కాదు.. కంప్లెయింట్లు.. కోర్టు కేసులు కూడా వేసేశారు.

ఆ పాటలో వినిపించే నమకం.. చమకం పదాలను.. సుముఖం.. గమకం అంటూ మార్చి మరీ సినిమాను విడుదల చేసినా.. ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అగ్రహారం గురించిన కొన్ని పదాలు తొలగించలేదు. దీనిపై హైకోర్టులో ఇప్పటికే పిల్ దాఖలు కాగా.. దీనిపై విచారణ కూడా జరుగుతోంది. ఈ సినిమాలోని అభ్యంతరకర పదాలను తొలగించాలంటూ నిర్మాతలకు.. సెన్సార్ బోర్డ్ కు వినతి పత్రం ఇచ్చినా వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే .. కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని న్యాయవాది చెబుతున్నారు.

ఆయా పదాలను సినిమా నుంచి పూర్తిగా తొలగించే వరకూ.. సినిమా ప్రదర్శన ఆపేయాలని.. కోర్టును కోరారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ కేసుపై ఇవాళ విచారణ జరగనుండగా.. ఈ కేసులో ప్రతివాదులుగా సెన్సార్ బోర్డ్ అధికారి.. వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రతినిధి ఉన్నారు. డీజేపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశంపై పరిశ్రమ వర్గాలు.. మెగాభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/