Begin typing your search above and press return to search.
బాలయ్యకు హైకోర్టు నోటీసుల షాక్!
By: Tupaki Desk | 28 March 2017 10:09 AM GMTసినిమాలకు పన్ను రాయితీ ఇచ్చే మొత్తం ఎవరికి చెందుతుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను రాయితీని నిర్మాతలు తీసుకోవాలా? లేక ఆ మొత్తాన్ని ప్రేక్షకులకు బదలాయించాలా? అన్నది పెద్ద డౌట్. న్యాయంగా చూస్తే.. ప్రభుత్వం రాయితీ ఇస్తే.. దాన్ని ప్రేక్షకులకు బదిలీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే.. ఈ బదిలీ ప్రేక్షకుల వద్దకు సినిమాను మరింత దగ్గరకు చేయటానికి మాత్రమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు.
అయితే.. పన్ను రాయితీని ప్రభుత్వం ఇచ్చినా.. దాన్ని అమలు చేసే విషయంలో మాత్రం నిర్మాతలు ముందుకు రాకపోవటం.. యథావిధిగా టికెట్ల ధరల్ని ఉంచటంపై పలువురు తప్పు పట్టారు. విమర్శలు చేసిన వారున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో గుణశేఖర్ తీసిన చారిత్రక సినిమాకు.. సంక్రాంతి సందర్భంగా విడుదలైన బాలకృష్ణ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించిన పన్ను మినహాయింపులపై సందేహాల్ని వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో పిటీషనర్ పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు.. విచారణకు స్వీకరించి.. సినీ హీరో బాలకృష్ణకు.. రెండు సినిమాల నిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. రెండు వారాల వ్యవధిలో సమాధానం చెప్పాలని సూచించారు. తన పిటీషన్ తో పాటు.. పన్ను మినహాయింపు విషయంలో గతంలో తమిళనాడు తీర్పును పిటీషనర్ ప్రస్తావించటం గమనార్హం. మరి.. పన్ను మినహాయింపు అంశంపై తమిళనాడు తీర్పు ఏమిటి?ఏ చిత్రంలో ఇది చోటు చేసుకుందన్న విషయాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/