Begin typing your search above and press return to search.

విజయ్ ‘మాస్టర్’ రిలీజ్.. హైకోర్టు కీలక ఉత్తర్వులు!

By:  Tupaki Desk   |   10 Jan 2021 5:30 PM GMT
విజయ్ ‘మాస్టర్’ రిలీజ్.. హైకోర్టు కీలక ఉత్తర్వులు!
X
తమిళ తలపతి విజయ్ హీరోగా తెరకెక్కిన్న లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’. లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.

అయితే.. కరోనా, లాక్ డౌన్ కారణంగా చాలా నష్టపోయామని, ఈ నేపథ్యంలో విజయ్ లాంటి పెద్ద హీరో సినిమా విజయవంతంగా థియేటర్లలో ఆడితేనే తమకు మేలు జరుగుతుందని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు భావించారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని సంప్రదించి, 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతి తెచ్చుకున్నారు.

కానీ.. ఈ నిర్ణయంపై అక్కడి విపక్షాలతోపాటు ప్రజానీకం కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. మరికొందరు కోర్టు మెట్లు ఎక్కడంతో 100 శాతం ఆక్యుపెన్సీ ఇవ్వొద్దని కోర్టు చెప్పింది. కేంద్రం కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పడంతో.. రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే.. తాజాగా మద్రాస్ హైకోర్టు ఈ చిత్రం విడుదలకు సంబంధించి కీలక ఉత్తర్వులను జారీ చేసింది.

కొత్త సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్ లైన్లో సినిమా దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మాస్టర్’ మూవీని ఇంటర్నెట్‌లో ప్రసారం చేయకుండా నిషేధించాలని మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి అనుగుణంగా న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

మాస్టర్ మూవీని ప్రదర్శించొద్దని దాదాపు 400 పైరసీ సైట్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతోపాటు ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్, బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్ వంటి సెల్యులార్ నెట్‌వర్క్ సంస్థలను కూడా మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.