Begin typing your search above and press return to search.
కోర్టులు కూడా బాహుబలికే సపోర్ట్
By: Tupaki Desk | 10 July 2015 4:34 PM GMTనిన్ననే ఓ ఆసామి బాహుబలిపై హైకోర్టులో పిల్ (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) దాఖలు చేశాడు. సినిమా టిక్కెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్మేయడం, థియేటర్ క్యూలో తొక్కిసలాటల్లో ఎందరో అమాయకులు బలవ్వడం తదితర పాయింట్లను హైలైట్ చేస్తూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం తరపున పిటిషన్ వేశాడు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్ట్ సరైన సాక్ష్యాల్లేవని కేసును కొట్టి పారేసింది. నిరాధార ఆరోపణ అంటూ కోర్టు కొట్టి పారేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కోర్టు భలే కామెడీ చేసిందంటూ దుయ్యబడుతున్నారు.
వాస్తవానికి ఏపీ, తెలంగాణలో టిక్కెట్ దందా అనేది అధికారికం. ఈ భోగోతం అంతా అధికారుల నుంచి రాజకీయనేతల నుంచి అందరికీ తెలిసే జరుగుతుంది. ఎక్కడ ఏ లొసుగు ఉందో అది ఎందుకు అలాగే కంటిన్యూ అవుతుందో కూడా తెలుసు. కానీ ఎవరూ పెదవి మెదపరు. దీని వెనక బోలెడంత ధనం చేతులు మారుతూ ఉంటుందని కొందరు చెబుతుంటారు. ఈ టిక్కెట్ దందా గురించి ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరికీ తెలుసని కొందరు నిర్మాతలు గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అయినా నిన్నటి పిల్‌పై హైకోర్టు లోతుగా అధ్యయనం చేయించకుండా సింపుల్‌గా కొట్టి పారేయడం సర్వత్రా చర్చకొచ్చింది.