Begin typing your search above and press return to search.

బాబు గోగినేనికి హైకోర్టులో ఊర‌ట‌!

By:  Tupaki Desk   |   21 July 2018 4:36 PM GMT
బాబు గోగినేనికి హైకోర్టులో ఊర‌ట‌!
X
హేతువాది బాబు గోగినేనిపై గత నెలలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విష‌యం తెలిసిందే. ఔత్సాహికుల ఆధార్ సమాచారాన్ని బాబు గోగినేని సేక‌రించార‌ని - త‌ద్వారా ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించార‌ని కొంద‌రు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో బాబు గోగినేనిపై దేశద్రోహం - మతాలు - కులాలు - వర్గాల పేరిట ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడం - శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం - మత విశ్వాసాలను అవమానించడం వంటి అభియోగాల‌పై మాదాపూర్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ నెల 25లోగా బాబు గోగినేనిపై పెట్టిన కేసుల పురోగ‌తిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేసి - బాబు గోగినేనిని హౌస్ బయటకు తీసుకువ‌చ్చి విచార‌ణ చేప‌ట్టే యోచ‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో తాను బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నందున విచార‌ణకు హాజ‌రు కాలేన‌ని బాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో, ఆ కేసు దర్యాప్తును 2 నెలలపాటు నిలిపివేయవలసిందిగా మాదాపూర్ పోలీసుల‌ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో బాబు గోగినేనికి ఊర‌ట ల‌భించింది. ఆ ఆదేశాల‌తో బాబు గోగినేని య‌థా ప్ర‌కారం 'బిగ్ బాస్ షో'లో కొనసాగేందుకు మార్గం సుగ‌మ‌మైంది. కాగా, గ‌త ఏడాది - టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు విచార‌ణ జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. అపుడు బిగ్ బాస్ హౌస్ మేట్ గా ఉన్న ముమైత్ ...కోసం నిబంధ‌న‌లు స‌డ‌లించి బ‌య‌ట‌కు పంపారు. బిగ్ బాస్ ప్ర‌తినిధితో పాటు ముమైత్ సిట్ విచార‌ణ‌కు హాజ‌రైంది. ఆ త‌ర్వాత య‌థాత‌ధంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది. ఇపుడు అదే త‌ర‌హాలో బాబు గోగినేని కూడా విచార‌ణ కోసం వెళ్లాల్సి వ‌స్తుంద‌ని అంతా భావించారు. అయితే, హైకోర్టు ఆదేశాల‌తో బాబుకు ఊర‌ట ల‌భించిన‌ట్ట‌యింది.