Begin typing your search above and press return to search.

అశ్లీల కేసు: రాజ్ కుంద్రాకు ఉపశమనం

By:  Tupaki Desk   |   18 Aug 2021 12:30 PM GMT
అశ్లీల కేసు: రాజ్ కుంద్రాకు ఉపశమనం
X
ఇప్పటికే అశ్లీల వీడియోల కేసులో అరెస్ట్ జైల్లో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయనను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే 2020లో నమోదు చేసిన మరో కేసులో అరెస్ట్ చేసేందుకు ముంబై పోలీసులు ప్రయత్నించారు. దీనిపై కోర్టుకు ఎక్కిన రాజ్ కుంద్రాకు ఊరట కలిగింది. ఆగస్టు 25వరకు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయకుండా ముంబై హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

రాజ్ కుంద్రా కేసు విచారణ సందర్భంగా ఆయన తరుఫున న్యాయవాది ప్రశాంత్ పాటిల్ వాదించారు. ఈ కేసులో ఇతర సహ నిందితులు ఇప్పటికే బెయిల్ పై ఉన్నారని.. రాజ్ కుంద్రాపై చేసిన నేరాలకు ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష విధించబడుతుందని.. అందువల్ల అరెస్ట్ నుంచి రక్షణ పొందాలని వాదించారు.

అయితే ఈ అభ్యర్థనను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రజక్తాషిండే వ్యతిరేకించారు. రాజ్ కుంద్రా పాత్ర ఇతర నిందితుల కంటే భిన్నమైందని.. కేసులో కీలక విచారణ జరుగుతున్న వేళ కొంత సమయం కావాలని కోరారు. ఈ క్రమంలోనే ఆగస్టు 25వరకు విచారణకు సమయం ఇస్తూ జస్టిస్ ఎస్ కే తదుపరి విచారణను ఆగస్టు 25వరకు వాయిదా వేశారు. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాను ఆగస్టు 25వరకు నిరోధించే మధ్యంతర ఉత్తర్వులను షిండే అనుమతించారు.

అంతుకుముందు అశ్లీల రాకెట్ కేసులో ముంబై పోలీసు సైబర్ క్రైమ్సెల్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో ముందస్తు బెయిల్కోసం ప్రయత్నించారు. హాట్ షాట్ యాప్ కు వ్యతిరేకంగా రాజ్ కుంద్రాకు లింక్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని వాదించాడు.

జులై 19న రాజ్ కుంద్రాను అశ్లీల వీడియోల కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం దిగువ కోర్టు అతడి ముందస్తు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టును అతడు ఆశ్రయించాడు. ఇది ఒక వారం పాటు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత, ఇతని చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నగ్న వీడియోలు తయారు చేయడం, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం వంటి అభియోగాలు రాజ్ కుంద్రాపై మోపబడ్డాయి.

గత ఏడాది ఇది ఫిబ్రవరి 4వ తేదీన మహిళలను బలవంతంగా శృంగార సినిమాల్లోకి నెట్టిన ఆరోపణలపై ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు పోర్న్ చిత్రాల వ్యాపార రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. బ్రిటన్ వేదికగా నడుస్తున్న యుకె ప్రొడక్షన్ అధిపతి ఉమేష్ కామత్ తో రాజ్ కుంద్రా కు సంబంధాలున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సినిమాల్లో, టెలివిజన్లలో నటించేందుకు ఉత్సాహం చూపించే మోడల్స్, అమ్మాయిలను వీరు టార్గెట్ చేస్తారు. వెబ్ సిరీస్, ఇతర షూటింగులు జరుపుతున్నట్లు నమ్మించి చివరి క్షణంలో స్క్రిప్ట్ మార్చేస్తారని పోలీసులు చెబుతున్నారు. ముంబై శివార్లలో షూటింగ్ చేసిన అనంతరం శృంగార వీడియోలను సోషల్ మీడియాలో ఉంచుతారు. సదరు వీడియోలను మన దేశం లో ప్రసారం చేయడం నేరం కాబట్టి బయట దేశాల్లోని సర్వర్ల ద్వారా హాట్ షాట్ అనే యాప్ లోకి అప్లోడ్ చేస్తున్నారు. లాక్ డౌన్లో పుణ్యమా అని సదరు యాప్ లోకి వివరాలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చేరారు. వీరు నుంచి చి డబ్బులు వసూలు చేసి వాటి ప్రసారాలను అందజేస్తారు. ఈ నెల 19వ తేదీన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు.

మన దేశంలో ప్రసారమవుతున్న ఛానళ్లపై, సోషల్ మీడియాపై టెలికం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ట్రాయ్ గట్టి నిఘా పెడుతుంది. అశ్లీల కంటెంట్ ప్రసారం చేసినా, నిర్మించినా కఠిన నిర్ణయాలు ఉంటాయి. ఐటీ యాక్ట్ ప్రకారం జైలు అనుభవించాల్సి ఉంటుంది. రాజ్ కుంద్రాపై ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 354C, 292, 293, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మహిళలు అశ్లీల చిత్రాల్లో నటించేందుకు బలవంతంగా ప్రేరేపించడంపైనా కేసులు నమోదు చేయబడ్డాయి.