Begin typing your search above and press return to search.

నయీం డైరీస్ మూవీకి హైకోర్టు షాక్

By:  Tupaki Desk   |   13 Dec 2021 11:32 AM GMT
నయీం డైరీస్ మూవీకి హైకోర్టు షాక్
X
తెలంగాణలో చాలా మంది చంపి దోచుకొని రియల్ దందా చేసిన గ్యాంగ్ స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘నయీం డైరీస్’. ఈ మూవీకి తాజాగా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ సినిమాను ఆపేయాలని ఆదేశించింది.

నయీం డైరీస్ మూవీలో అసభ్యకర దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారురాలు బెల్లి లలిత కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేవరకూ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది.

ఈ క్రమంలోనే సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేందుకు తమకు రెండు రోజుల సమయం కావాలని నయీం డైరీస్ సినిమా దర్శకుడు కోర్టును కోరారు. సాధ్యమైనంత త్వరగా ఈ దృశ్యాలను తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఈ కేసును తదుపరి విచారణణు బుధవారానికి వాయిదా వేసింది.

కాగా నయీం డైరీస్ మూవీ గత శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ మూవీ విడుదలైన సంధ్య థియేటర్ వద్ద బెల్లి లలిత కుటుంబ సభ్యులు, తెలంగాణ వాదులు ఆందోళనకు దిగడంతో ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.అనంతరం సినిమాపై ఆందోళనకారులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

నయీం డైరీస్ మూవీలో వశిష్ట సింహ, నిఖిల్ దేవాదుల, యగ్నశెట్టి, సంయుక్త, శశికుమార్ ముఖ్యపాత్రలు పోషించారు.