Begin typing your search above and press return to search.
చీటింగ్ కేసులో హీరోయిన్ కు ఊరట
By: Tupaki Desk | 10 March 2019 5:27 AM GMTఒక ఈవెంట్ లో పాల్గొంటానని అడ్వాన్స్ తీసుకుని చివరి నిమిషంలో రాకుండా హ్యాండ్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై ఈవెంట్ మేనేజర్ కేసు పెట్టిన విషయం తెల్సిందే. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సోనాక్షిని విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం జరిగింది. తన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, తనకు నష్టం జరిగింది, ఆ నష్టంకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. మరో వైపు సోనాక్షి మేనేజర్స్ ఈవెంట్ మేనేజర్ పై రివర్స్ ఎటాక్ అయ్యారు. సరైన ఏర్పాట్లు చేయక పోవడంతో పాటు, ముందస్తుగా అనుకున్న అమౌంట్ ను ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.
గత సంవత్సరం నవంబర్ లో సోనాక్షి సిన్హాపై కేసు నమోదు అయ్యింది. కేసు పెట్టిన వ్యక్తి అన్ని ఆధారాలను సమర్పించిన నేపథ్యంలో సోనాక్షి సిన్హాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దం అయ్యారు. ఈ నేపథ్యంలో సోనాక్షి సిన్హా అలహాబాద్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తనను అరెస్ట్ చేయకుండా ఆపాలని ఆమె పిటీషన్ లో కోరడం జరిగింది. సోనాక్షి సిన్హా పిటీషన్ ను విచారించిన కోర్టు అరెస్ట్ పై స్టే విధించింది. అయితే చీటింగ్ కేసుపై విచారణ యధావిధిగా జరుగుతుందని మాత్రం తేల్చి చెప్పింది. చీటింగ్ కేసులో ప్రస్తుతానికి సోనాక్షి సిన్హాకు ఊరట దక్కినట్లయ్యింది.