Begin typing your search above and press return to search.
యుఎస్ లో సాహోకు చుక్కెదురు
By: Tupaki Desk | 28 Aug 2019 5:17 AM GMTఎల్లుండి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ గంటలను యుగాలుగా లెక్కబెట్టుకుంటున్నారు. సాహో ప్రపంచవ్యాప్తంగా పది వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ అవుతుండటంతో ఫస్ట్ డే రికార్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయో అన్న అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా చాలా కీలకమైన యుఎస్ లో మాత్రం సాహోకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదన్నది కొంత చేదుగా అనిపించినా కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం.
ఇప్పటిదాకా ప్రీమియర్ల అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కేవలం $350K డాలర్ల లోపే వచ్చాయన్నది అక్కడి ట్రేడ్ రిపోర్ట్. టికెట్ ధరలు అన్ని వెర్షన్లు కలిపి భారీగా పెట్టడంతో రిపోర్ట్ వచ్చాక వెళదామనే ధోరణి ఎన్ ఆర్ ఐస్ లో ఎక్కువగా వచ్చేయడంతో ఫస్ట్ డే మిలియన్ మార్క్ చేరుకోవడం అనుమానమే అని తెలుస్తోంది. సాహో బాహుబలి 2నే కాదు ఖైదీ నెంబర్ 150తో సహా చాలా సినిమాలను బీట్ చేయాలంటే మొదటి రోజే 1 మిలియన్ మార్క్ టచ్ చేయాలి. స్లోగా రీచ్ అయితే పరువు పోతుంది. ఈ మాత్రం దానికా ఇంత హడావిడి చేశారు అనే కామెంట్స్ వస్తాయి.
ఫైనల్ రన్ అయ్యేలోపు 3.5 మిలియన్లు వస్తేనే సాహో సేఫ్ గా నిలుస్తుంది. కానీ యుఎస్ లో బజ్ చూస్తుంటే ఆ ఫీట్ సాధ్యమేనా అనే అనుమానం కలుగుతుంది. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తే తప్ప అంత సులభంగా సాహో టార్గెట్ రీచ్ చేయలేదు. వంద కోట్ల సినిమాలుగా అద్భుతాలు సృష్టించిన కేజిఎఫ్ - ఖైదీ నెంబర్ 150 స్థాయిలో కూడా సాహోకు ఓవర్సీస్ లో సౌండ్ లేకపోవడం కొంత ఆందోళన కలిగించే అంశమే. మొదటి ప్రీమియర్ అయ్యాక ఎలాగూ ఫలితం తేలిపోతుంది కాబట్టి అప్పటిదాకా టెన్షన్ ని బిగబట్టి వెయిట్ చేయడమే ఇప్పటికైతే ఎవరైనా చేయగలిగింది.