Begin typing your search above and press return to search.
బాహుబలి రూటు ఫాలో అవుతున్న నాగ్
By: Tupaki Desk | 7 Nov 2017 9:08 AM GMT‘బాహుబలి: ది బిగినింగ్’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. సినిమాకు సంబంధించి పది నిమిషాలకు పైగా కంటెంట్ బయటికి వచ్చేయడం అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కోట్లు ఖర్చు పెట్టి.. వేలామంది నెలల తరబడి రేయింబవళ్లు కష్టపడి తీసిన దృశ్యాలు విడుదలకు ముందే ఇలా లీక్ అయితే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలో ఇలాంటి పొరబాట్లకు తావు లేకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసుకుంది చిత్ర బృందం. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన రా వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఐతే అందులో క్లారిటీ లేకపోవడంతో పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. ఆ తర్వాత సెక్యూరిటీ మరింత పటిష్టం చేసి కంటెంట్ ఏదీ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు.
ఇప్పుడు ‘హలో’ సినిమా విషయంలో అక్కినేని నాగార్జున కూడా ఇదే రూటును ఫాలో అవుతున్నట్లు సమాచారం. ‘హలో’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం చాలానే ఉందట. దీనికి సంబంధించిన వర్క్ వేర్వేరు చోట్ల నడుస్తోంది. అక్కడి నుంచి అన్నపూర్ణ స్టూడియోకు కంటెంట్ వస్తోంది. ఆ కంటెంట్ ఉన్న చోట పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశాడట నాగ్. ఇక్కడికి ఎవ్వరూ ఫోన్లతో లోపలికి రాకూడదట. పెన్ డ్రైవ్స్ కూడా తీసుకురాకూడదట. మొత్తంగా భద్రత ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ‘హలో’ సినిమా ఆలస్యమవుతుండటానికి వీఎఫెక్స్ పనుల్లో జాప్యమే కారణమని కూడా అంటున్నారు. దీని వల్ల ఈ చిత్రం అనుకున్న ప్రకారం డిసెంబరు 22న వస్తుందా రాదా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.