Begin typing your search above and press return to search.
డిస్ట్రిబ్యూటర్లు పేమెంట్లు ఎలా వేస్తారబ్బా?
By: Tupaki Desk | 11 Nov 2016 10:30 PM GMTవంద.. ఐదొందల రూపాయల నోట్ల బ్యాన్ దెబ్బ ఫిలిం ఇండస్ట్రీపై బాగానే పడిందని చెప్పుకున్నాం. రెండు రోజులుగా బ్యాంకులు తెరవడం.. ఇప్పుడు ఏటీఎంలు కూడా ఫుల్లుగా క్యాష్ తో కళకళలాడుతుండడంతో.. జనాల చేతుల్లోకి డబ్బులు వచ్చేశాయి. ఈ కాన్ఫిడెన్స్ తోనే.. సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని వాయిదా వేయకుండా థియేటర్లలోకి తెచ్చేశారు.
అయితే.. ఇప్పుడు జనాలు కౌంటర్లలో డబ్బులు కట్టి టికెట్లు కొన్నా.. థియేటర్ల జనాలు ఆ అమౌంట్ ని బ్యాంకుల్లో వేసుకోవడానికి ఇబ్బందులున్నాయి. ఇలాంటి సమయంలో రోజూ లక్షల కొద్దీ అమౌంట్స్ అకౌంట్స్ లో వేస్తే.. ఇన్ కం ట్యాక్స్ ఇబ్బందులు తప్పకపోవచ్చు. డిస్ట్రిబ్యూటర్లకు చేయాల్సిన పేమెంట్స్ విషయంలో బాగా డిస్టర్బెన్స్ వచ్చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సాహసంకు మాత్రమే కాదు.. రాబోయే సినిమాలకు కూడా ఈ సమస్య ఎదురుకానుంది.
అసలు ఇలాంటి సమస్యలు లేకుండా చేయాలంటే ఓ మార్గం ఉంది. మల్టీప్లెక్సుల్లో మాదిరిగానే.. సింగిల్ స్క్రీన్లలో కూడా టికెటింగ్ వ్యవస్థను ఆన్ లైన్ చేసేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అప్పుడు అమౌంట్ మొత్తం ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ అయిపోతుంది. ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో ఈ విధానం ఉంది. అక్కడ టికెట్లు కొంటూ ఉండగానే.. కలెక్షన్స్ ఎంతొచ్చాయో తెలిసిపోతుంది. ప్రతీ నిమిషం అప్ డేట్ అయిపోయే వ్యవస్థ ఉంది. ఇక్కడ కూడా కౌంటర్లలోనే కార్డులతో టికెట్లు కొనేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. అసలు ఈ నగదు సమస్యే ఎవరికీ ఉండదు కదా అంటున్నారు సినిమా జనాలు. మరి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఈ దిశగా అడుగులు వేస్తుందా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/