Begin typing your search above and press return to search.

నోట్ల రద్దు వ్యవహారంతో థియేటర్ల పరిస్థితి ఇది!

By:  Tupaki Desk   |   12 Nov 2016 5:04 AM GMT
నోట్ల రద్దు వ్యవహారంతో థియేటర్ల పరిస్థితి ఇది!
X
పలు సెకార్లపై పెద్ద నోట్ల రద్దు నిర్ణయ ప్రభావం తీవ్రంగానే పడింది. ఇదే విషయంలో సినీ రంగమైతే మునుపెన్నడూ లేనంత భారీ నష్టాలను చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన సినిమాలపైన ఈ నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా పడింది. శుక్రవారం విడుదలయిన నాగచైతన్య మూవీ "సాహసం శ్వాసగా సాగిపో" మంచి టాక్ తెచ్చుకున్నా... నోట్ల రద్దు వ్యవహారంతో థియేటర్ల వద్ద జనాలు లేరు. తెలుగు రాష్ట్రాల మొత్తంలోనూ ఇదే పరిస్థితి! ఇది ఒక్క ఈ సినిమాకే కాదు, దాదాపు అన్ని ప్రాంతాలలోనూ, సుమారు అన్ని థియేటర్లలోనూ ఇదే పరిస్థితి. ఈ సమయంలో చాలాచోట్ల పలు సినిమాలను కూడా విడుదలచేయకుండా ఆపుకున్నారంటే... పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

థియేటర్లు - క్యాంటిన్ లే కాదు దాదాపు అన్ని రంగాలు - అన్ని సెక్టార్లు ఈ నోట రద్దు వల్ల రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని ఫైనానిషియల్ ఎమర్జెన్సీ గా కూడా పలువురు విశ్లేషిస్తున్నారు. తాజాగా అహ్మదాబాద్‌ లోని ఒక మల్టిపెక్స్‌ లో గురువారం మధ్యాహ్నం జరిగిన సంఘటనకు సంబందించిన ఫోటో ఒకటి ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటోనే చెబుతుంది... నోట్ల రద్దు వల్ల థియేటర్లలో పరిస్థితి ఎలా ఉందనే విషయం.

ఈ మల్టిప్లెక్స్ లో మధ్యాహ్నం షోకి ఒక్కడే ప్రేక్షకుడు వచ్చాడు. సినిమాలంటే పిచ్చిగా అభిమానించే 21 ఏళ్ల హరి‌పంచల్ గురువారం షోను వీక్షించడానికి వచ్చాడు. ఈ సమయంలో మరికొంతమంది థియేటర్‌ కు వచ్చినా కౌంటర్లో రూ.1,000 - 500 నోట్లను తీసుకోకపోవడంతో వెనుదిరిగారు. కానీ... పట్టువదలని విక్రమార్కుడు గుర్తొచ్చాడో ఏమో కానీ... తన డెబిట్ కార్డుతో టిక్కెట్ కొని సుమారు 200 మంది సామర్థ్యం గల థియేటర్‌ లో ఒక్కడే సినిమా చూశాడు. ఆ కుర్రాడి ఆసక్తి సంగతి అటుంచితే... దేశం మొత్తం మీద థియేటర్ల పరిస్థితిని ఈ సంఘటన చెప్పకనే చెబుతుందని సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/