Begin typing your search above and press return to search.

భ‌రత్ యాక్ష‌న్ అదిరిపోద్ది!!

By:  Tupaki Desk   |   9 April 2018 10:14 AM GMT
భ‌రత్ యాక్ష‌న్ అదిరిపోద్ది!!
X
ఫ‌స్ట్ లుక్‌- ఓత్‌- బ‌హిరంగ స‌భ‌- విజ‌న్‌... పూర్తిగా రాజ‌కీయ డిక్ష‌న‌రీతో ముస్తాబ‌వుతోంది ‘భ‌ర‌త్ అను నేను’. అయితే రాజ‌కీయ నేప‌థ్యంలోనూ త‌న మార్కు ఫైట్ సీన్లు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు కొరిటాల శివ‌. ట్రైల‌ర్ లో మ‌హేస్ డైలాగులు ఎంత హైలెట్ అయ్యాయో... యాక్ష‌న్ స‌న్నివేశాలు అదే రేంజ్‌లో అదిరిపోయాయి.

కొరిటాల శివ పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ క్లాస్ సినిమాలు తీస్తాడు... కానీ అందులోనే యాక్ష‌న్ ప్రియుల‌కు న‌చ్చేలా బోలెడ‌న్ని ఫైట్లు జోడిస్తాడు. ‘భ‌ర‌త్ అను నేను’ సినిమాలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మ‌హేష్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టిస్తుండ‌డంతో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉండ‌వేమోన‌ని అనుకున్నారు చాలామంది. అయితే త‌ప్పు చేస్తే చిన్నా... పెద్దా... మ‌న‌వాడు... ప‌క్క‌వాడు అని తేడా లేకుండా దండించే నాయ‌కుడిగా భ‌ర‌త్ క‌నిపించ‌బోతున్నాడు. ఫైట్ మాస్ట‌ర్స్ రామ్‌-ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో రూపొందుతున్న హోలీ ఫైట్ సీన్ సినిమాలో మేజ‌ర్ హైలెట్ అని చెబుతున్నారు.

మేకింగ్ వీడియోలోనూ... విజ‌న్ లోనూ క‌నిపించిన చిన్న చిన్న యాక్ష‌న్ బిట్లు చూస్తుంటేనే ఈ ఫైట్ ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మవుతోంది. మ‌హేష్ ఒక రౌడీని కొట్టి... వీపుపై ప‌డేసుకుని న‌డిచే సీన్ ఇందులోదే. ప్రీ క్లైమాక్స్ లో వ‌చ్చే ఈ పోరాట స‌న్నివేశాలు మిర్చి సినిమాలో రెయిన్ ఫైట్ ను త‌ల‌పిస్తాయ‌ని అంటున్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే శ్రీ‌మంతుడు కాంబినేష‌న్ మ‌ళ్లీ స‌క్సెస్ కొట్ట‌డం ప‌క్కా అని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు మ‌హేష్ ఫ్యాన్స్‌.