Begin typing your search above and press return to search.

కార్లు-బస్సులు.. కోట్లు.. సాహో..

By:  Tupaki Desk   |   4 April 2018 9:43 AM GMT
కార్లు-బస్సులు.. కోట్లు.. సాహో..
X
బాహుబలి2 తర్వాత ప్రభాస్ నుంచి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగానే ఉన్నారు. ఆ సినిమాతో పాటే సాహో టీజర్ ఇచ్చేస్తే.. ఎంత స్పీడ్ గా ఈ సినిమా ఫినిష్ అయిపోతుందో అనుకున్నారు. కానీ ఈ నెలాఖరుతో బాహుబలి2 వచ్చి ఏడాది పూర్తవుతుంది. మరి సాహో ఎప్పుడొస్తుంది అంటే ఆన్సర్ చాలా కష్టం. ఈ సినిమా కోసం ఓ మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ను.. దుబాయ్ లో ప్లాన్ చేశారు.

బుర్జ్ ఖలీఫా దగ్గర షూట్ చేసేందుకు ఎట్టకేలకు మేకర్స్ అనుమతులు సంపాదించారు. ఇక్కడ ప్రస్తుతం రెక్కీ నిర్వహిస్తున్న సాహో టీం.. యూఎస్-జర్మనీ దేశాల నుంచి అనేక వెహికల్స్ ను తెప్పించుకుంటున్నారు. భారీ సైజులో ఉండే వాల్వో బస్సులు.. కార్లను ఇంపోర్ట్ చేసుకుంటున్నారట. సినిమా మొత్తం మీద ఈ సన్నివేశమే పెద్ద హైలైట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారట. అందుకే ఏకంగా ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే 35-40 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నది టాక్. అయితే.. మన సినిమాల్లో సహజంగా ఇలాంటి ఛేజింగ్ సీక్వెన్సులలో వాటిని తెగ నాశనం చేసేస్తుంటారు.

అయినా.. ఒక్క సీక్వెన్స్ కోస ఇంత ఖరీదు పెట్టి అన్నేసి ఖరీదైన వెహికల్స్ తెచ్చే బదులుగా వాటికి దగ్గరగా ఉండే మోడల్స్ ను తీసుకోవడం.. లేదా గ్రాఫిక్స్ లో పని పూర్తి చేయడం వంటివి చేస్తే.. బడ్జెట్ భారీగా మిగులుతుందిగా అనే సలహాలు బాగానే వినిపిస్తన్నాయి. సలహాలు బాగానే ఉంటాయ్ కానీ.. 150 కోట్ల ఖర్చుతో తీసే సినిమాలో.. దాదాపు 4వ వంతు ఈ ఒక్క సీన్ కే పెడుతున్నారంటే.. ప్లానింగ్ లో విషయం ఉండే ఉంటుంది లెండి.