Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ లోనూ దున్నేస్తున్న ‘జాతి రత్నాలు’.. డాలర్ల పంట!
By: Tupaki Desk | 14 March 2021 2:45 PM GMTకరోనా లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు మునుపటిలా థియేటర్ కు రావడానికి ఎంత కాలం పడుతుందో అనుకున్నారు అంతా. ఇక, ఓవర్సీస్ మార్కెట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనుకున్నారు. కానీ.. ఊహించనంత వేగంగా కోలుకుంటోంది సినీరంగం. సినిమాలో కంటెంట్ ఉండాలేగానీ బాక్సాఫీస్ నంబర్లు ఎక్కడికో వెళ్లిపోతాయని చెప్పాయి పలు చిత్రాలు.
లేటెస్ట్ గా.. ‘జాతిరత్నాలు’ కొల్లగొడుతున్న కలెక్షన్స్ చూసి ట్రేడ్ అనలిస్టులు కూడా నోరెళ్లబెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అదరగొడుతున్న ఈ మూవీ.. ఓవర్సీస్ లోనూ దుమ్ము లేపుతోంది. ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన ఉప్పెన చిత్రాన్ని మించి కలెక్షన్లు రాబడుతోందీ చిత్రం. ఓవర్సీస్ లో ఉప్పెన కేవలం రెండు లక్షల డాలర్ల లోపే వసూళ్ల రాబట్టగా.. జాతిరత్నాలు శనివారం నాటికే 5.38 లక్షల డాలర్లు కొల్లగొట్టింది.
ఈ జోరుతో.. కరోనా తర్వాత ఓవర్సీస్ లో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన చిత్రం జాతిర్నతాలు నిలిచింది. ఆదివారం షోలతో ఈ నంబర్స్ భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ ఫుల్ రన్ లో 8 నుంచి 10 లక్షల డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కేవలం మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేయడం విశేషం. 11.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ వేట మొదలు పెట్టిన జాతిరత్నాలు.. తొలి మూడు రోజుల్లోనే 14.47 కోట్ల షేర్ సాధించింది భారీ హిట్ గా నిలిచింది. ఇక, ఫుల్ రన్ లో ఎంత కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి