Begin typing your search above and press return to search.

రేటింగ్స్ తో ఆడుకున్నాడుగా

By:  Tupaki Desk   |   13 April 2018 7:56 AM GMT
రేటింగ్స్ తో ఆడుకున్నాడుగా
X
తెలుగు ఛానల్స్ లో ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా డాన్స్ ప్రోగ్రాములు టెలికాస్ట్ అయినా ఆటది మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం. ఆ షో చివర్లో ఆగిపోయినప్పుడు వచ్చిన విమర్శలు వివాదాలు పక్కన పెడితే నడుస్తున్నంత కాలం రేటింగ్స్ పరంగా అది రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. దాని వల్లే యాంకర్ ఓంకార్ విపరీతమైన పాపులారిటి తెచ్చుకున్నాడు. టీవీ చూసే అలవాటున్న ప్రతి ఒక్కరికి తను సుపరిచితుడు అయ్యేంతగా ఆ షో సక్సెస్ చేసాడు. సినిమా దర్శకుడిగా తన కెరీర్ మార్చుకునే దశలో కొంత కాలం బుల్లితెరకు దూరమైన ఓంకార్ ఇటీవలే స్టార్ మా ప్రోగ్రాం 'సిక్స్త్ సెన్స్' కోసం గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రసారం చేసిన మొదటి ఎపిసోడ్ తోనే 11.2 టిఆర్పి రేటింగ్ సాధించి అమ్మ ఓంకారన్నయ్య అనిపించేసాడు.

ఇది ఎలా చూసుకున్నా చాలా పెద్ద రేటింగ్ అని చెప్పాలి. మామూలుగా సూపర్ హిట్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ కి మాత్రమే 10 ప్లస్ రేటింగ్ దక్కుతుంది. అలాంటిది కాన్సెప్ట్ ఎలా ఉంటుందో పూర్తిగా అవగాహన లేని ఒక రియాలిటీ షో ఇంత తెచ్చుకోవడం అంటే గ్రేటే. పైగా సీరియల్స్ హవా విపరీతంగా ఉన్న టైంలో వాటి పోటీని తట్టుకుని మరీ ఈ షోకి ఇంత ఆదరణ తెప్పించాడు అంటే అందులో ఓంకార్ ఇమేజ్ పాత్ర చాలా ఉంది. తనకు బాగా అచ్చి వచ్చిన రాజు గారి గది సీక్వెన్స్ కంటిన్యూ చేస్తానంటున్న ఓంకార్ ఇప్పుడు మూడో భాగానికి స్క్రిప్ట్ కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడట. మధ్యలో ఎలాగూ గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ లోపు సిక్స్త్ సెన్స్ చేసేద్దామని ఇటు వచ్చినట్టు టాక్. వెరైటీ కాన్సెప్ట్ తో రన్ అవుతున్న సిక్స్త్ సెన్స్ మీద స్టార్ మా భారీ ఆశలే పెట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 2 కి ఇంకా టైం పట్టేలా ఉండటంతో దీని ద్వారా భారీ ఆదాయం ఆశిస్తున్నారు.