Begin typing your search above and press return to search.
హలో హైలైట్స్.. ఈ ఎపిసోడ్స్
By: Tupaki Desk | 7 Dec 2017 1:11 PM GMTఈ నెల 22న విడుదల కానున్న హలో ముూవీ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎధురుచూస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఫుల్ మాస్ హీరోగా అఖిల్ ను ఈ చిత్రం నిలబెట్టేస్తుందని అంచనాలు వేసుకున్నారు.
విక్రమ్ కె కుమార్ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా యాక్షన్ ఎపిసోడ్స్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రెగ్యులర్ స్టోరీస్ కి భిన్నంగా.. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7.30వరకూ.. అంటే 12 గంటల్లో జరిగే కథే ఈ చిత్రం అంటున్నారు. అయితే.. ఆయా సన్నివేశాల్లో ఫ్లాష్ బ్యాక్స్ రూపంలో మిగిలిన కథను చూపిస్తారట. ఇదిలా ఉంటే.. అఖిల్ మూవీలో మూడు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. మొదటగా ఔటర్ రింగ్ రోడ్డుపై తీసిన ఓ ఛేజింగ్ సీన్ సూపర్బ్ గా ఉంటుందట. కార్లు.. వాటి మధ్య పరిగెత్తే మనుషులతో ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.
కృష్ణా నగర్ లో బిల్డింగ్ ల పై నుంచి జంపింగ్స్ చేస్తూ సాగే మరో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుందని అంటున్నారు. జాకీచాన్ టైపులో ఈ సన్నివేశానికి కామెడీ టచ్ కూడా అద్దారట. వీటితో పాటు.. హైద్రబాద్ మెట్రో రైల్ లో తీసిన సీక్వెన్స్ అయితే.. ఒళ్లు గగుర్పొడిస్తుందని తెలుస్తోంది. మెట్రో ప్రారంభానికి ముందే హలో మూవీ యాక్షన్ సీక్వెన్స్ పిక్చరైజ్ చేసిన సంగతి తెలిసిందే.